Faima: బిగ్ బాస్ వల్ల ఫైమా, ప్రవీణ్ విడిపోయారా.. ఏమైందంటే?

Faima: జబర్దస్త్ లేడీ కమెడియన్, బిగ్ బాస్ కంటెస్టెంట్ పైమా గురించి మనందరికీ తెలిసిందే. ఇటీవలే 13వ వారం ఎలిమినేషన్స్ లో భాగంగా పైమా ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. నిజానికి 12 వ వారం ఎలిమినేట్ కావాల్సి ఉండగా ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉపయోగించి సేవ్ అయ్యింది. ఇది ఇలా ఉంటే ఫైమా ఎలిమినేట్ అయిన తర్వాత మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అలాగే తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి హంగామా చేస్తూ నానా రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఫైమా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు పైమాకు ఓట్లు వేయండి అంటూ కమెడియన్ ప్రవీణ్ ఏ స్థాయిలో ప్రమోట్ చేశాడో మనందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ట్విట్ చేయడంతో పాటు తన వీడియోల ద్వారా ఆమెను ప్రమోట్ చేశాడు ప్రవీణ్.

 

అయితే ఫైమా హౌస్ లో ఉన్నప్పుడు బాగానే ప్రమోట్ చేస్తున్న ప్రవీణ్ ఆమె ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఇంతవరకు ఆమెను కలవలేదు. దీంతో ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా గతంలో అనగా బిగ్ బాస్ హౌస్ కి ఫైమా ఎంట్రీ ఇవ్వకముందు ఫైమా అలాగే ప్రవీణ్ ఇద్దరు కలిసి యూట్యూబ్ ఛానల్ లో వారి ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టిన విషయం తెలిసిందే. ఫైమా హౌస్ లో ఫ్యామిలీ ఎపిసోడ్స్ లో భాగంగా బుల్లెట్ భాస్కర్ స్టేజి మీదకు రావడంతో ఫైమా రెండు మూడుసార్లు అందరూ బాగున్నారా అనగానే వెంటనే భాస్కర్ వాడు కూడా బాగున్నాడు అని అనగా ఫైమా సిగ్గుతో తలదించుకుంది.

 

కానీ అటువంటిది ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత ప్రవీణ్ ఆమెను కలవకపోవడం గురించి ఎటువంటి పోస్టులు వీడియోలు చేయకపోవడం ప్రస్తుతం అనేక అనుమానాలకు తావిస్తోంది. పైమా ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన తర్వాత సెలబ్రేషన్స్ లో కొందరు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కనిపించారు. కానీ ప్రవీణ్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. దాంతో ఫైమా,ప్రవీణ్ ల మధ్య దూరం పెరిగిందా వారి మధ్య ఉన్న సాన్నిహిత్యం దెబ్బతినిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిద్దరూ కలవక పోవడానికి కారణాలు ఏమైనా ఉంటాయి అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఈ వార్తలపై పైమా ప్రవీణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -