Hansika: స్టార్ హీరోకు వార్నింగ్ ఇచ్చిన భార్య.. ఏమైందంటే?

Hansika: దేశముదురు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు ముంబై ముద్దుగుమ్మ హన్సిక. ఈమె బాల నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం దేశముదురు సినిమా ద్వారా పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయాన్ని అందుకున్న ఈమె తెలుగులో పలు సినిమాలలో నటించి సందడి చేశారు.

తెలుగు సినిమాలలో నటిస్తున్న సమయంలోనే ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక స్టార్ హీరోతో ప్రేమలో పడిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇకపోతే కొన్ని మనస్పర్ధలు కారణంగా వీరిద్దరికి బ్రేకప్ కావడంతో ఈమె తమిళంలో కూడా వరుస సినిమాలలో నటిస్తూ తమిళ హీరో శింబుతో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. ఇలా కొద్దిరోజుల పాటు పీకల్లోతు ప్రేమలో మునిగిన ఈ జంట చివరికి బ్రేకప్ చెప్పుకున్నారు. ఇక హన్సిక సైతం తన బిజినెస్ పార్ట్నర్ అయినటువంటి సోహైల్ కత్తురియా అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.

 

వీరి వివాహం డిసెంబర్ 4వ తేదీ జైపూర్ లోని మంటోడ ప్యాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక వీరి వివాహానికి సినీ సెలబ్రెటీలు ఎవరు హాజరు కాకపోవడం విశేషం. ఇకపోతే ఈమె తెలుగులో ఒకప్పుడు ప్రేమలో మునిగి తేలిన తన మాజీ ప్రియుడిని తన పెళ్లికి ఆహ్వానించారట. ఎలాగో తనకు పెళ్లి అయిందని హన్సిక వివాహం కోసం ఆ హీరో వెళ్లడానికి సిద్ధమయ్యారని అయితే తన భార్య అడ్డుపడిందని తెలుస్తోంది.

హన్సిక పెళ్లికి కనుక తాను వెళితే తన ముందే పీక కోసుకొని చనిపోతాను అంటూ తన భార్య స్టార్ హీరోకి వార్నింగ్ ఇవ్వడంతో చేసేదేమీ లేక ఆ హీరో కూడా హన్సిక పెళ్లికి వెళ్లకుండా ఆగిపోయారని సోషల్ మీడియాలో ఈ వార్త సంచలనంగా మారింది.ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో హన్సికతో ప్రేమలో బ్రేకప్ చెప్పుకున్న ఆ హీరో ఎవరా అని పలువురు నేటిజన్స్ ఆరా తీస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -