Vomitings: ప్రయాణంలో వాంతులు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా. అయితే ఈ చిన్న చిట్కా పాటించండి.

Vomitings: నేడు దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించడం తప్పనిసరిగా మారింది. వ్యక్తిగత పనుల కోసం ,విహారయాత్రల కోసం ,పెళ్లి పేరంటాల కోసం తరచుగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. చాలామందికి ట్రావెలింగ్ అంటే ఎంతో మక్కువ. ఎటువంటి సమస్య లేకుండా ఎంత దూరానికైనా ఇట్టే వెళ్లి వస్తుంటారు. మరికొందరికి ప్రయాణం చేయాలి అన్న ఆసక్తి ఉన్నప్పటికీ వెహికల్ ఎక్కింది మొదలుకొని వాంతులు సమస్యతో సతమతమవుతూ ఉంటారు. ఈ వామిటింగ్ ఫోబియా వల్ల కొన్ని సందర్భాలలో ప్రయాణం అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా నలుగురితో కలిసి సరదాగా ప్రయాణం చేసేటప్పుడు ఇలా వాంతులు చేసుకోవడం వాళ్లకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.

 

అందుకని చాలా వరకు వాళ్ళు వెళ్లాల్సి వచ్చిన ప్రయాణాలు చేయకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. బస్సు కారు ఇలా ఏది ఎక్కిన కిటికీ దగ్గర కూర్చునే దానికి ప్రాధాన్యతనిస్తారు. సరదాగా అందరూ గడిపే ట్రిప్ కాస్త వీళ్లకు ఎంతో ఇబ్బందిగా మారుతుంది. ముఖ్యంగా ఇలా ప్రయాణాల్లో వాంతులు అవ్వడానికి ముఖ్య కారణం మన చెవిలో ఉండే లాబ్రింథైన్ క్లీన్ గా లేకపోవడం. మన చెవి ద్వారా లోపలికి ప్రవేశించిన మురికి అక్కడ పేరుకుపోవడం వల్ల మెదడుకు అందాల్సిన సంకేతాలు సరిగ్గా చేరవు. దాంతో ప్రయాణం అప్పుడు వికారం ,తలనొప్పి ,వాంతులు వంటి సమస్యలు తలెత్తుతాయి.

 

ఇలా రెగ్యులర్ గా ప్రయాణాల్లో వాంతులు సమస్యతో బాధపడేవారు ఈ మూడు వస్తువులను తమ దగ్గర ఉంచుకోవడం వల్ల ఇబ్బంది నుంచి తప్పించుకునే అవకాశం పొందుతారు. ప్రయాణాల్లో వికారంగా అనిపించినా వాంతు వస్తున్న భావన కలిగిన వెంటనే అరటిపండు తినడం వల్ల సమస్య తగ్గుతుంది. నిమ్మకాయ వాసన చూసినా నిమ్మరసం తాగిన కూడా వికారం సమస్య మనల్ని వేధించదు. నిమ్మరసంలో నాన్న పెట్టి ఎండ పెట్టిన అల్లం ముక్కలు ఎప్పుడూ మన పర్సులో ఉంచుకోవడం వల్ల ఎంతో లాభం కలుగుతుంది. తలనొప్పి వికారం వంటి సమస్యలు ఉత్పన్నమైనప్పుడు వెంటనే ఒక అల్లం ముక్క నోట్లో పెట్టుకున్నా ,లేదు మంచి అల్లం టీ లాంటిది తాగిన వెంటనే రిలాక్స్ అవుతారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -