Kids Diabetes: పిల్లల్లో డయాబెటిస్ ను ఏవిధంగా గుర్తించాలో తెలుసా?

Kids Diabetes: ప్రస్తుత రోజుల్లో చిన్నవారి నుంచి పెద్దవారి వరకు చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. ఇదివరకు కేవలం వయసు మీద పడిన వారికి మాత్రమే ఈ డయాబెటిస్ సమస్యలు వచ్చేవి. కానీ రాను రాను ఆహారపు అలవాట్లు జీవనశైలిలో మార్పుల కారణంగా డయాబెటిస్ సమస్యతో చిన్న వయసు వారు కూడా బాధపడుతున్నారు. డయాబెటిస్ అన్నది దీర్ఘకాలిక సమస్య. ఇది ఒక్కసారి వచ్చింది అంటే చనిపోయేంతవరకు వెళ్లదు. అయితే డయాబెటిస్ ను పూర్తిగా నియంత్రించడానికి ఇప్పటివరకు ఎటువంటి మందులు అందుబాటులోకి రాలేదు కానీ డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచుకోవడానికి ఎన్నో రకాల మందులు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.

 

డయాబెటిస్ లో రెండు రకాల డయాబెటిస్ లు ఉన్నాయి అంటే ఒకటి టైప్ 1 డయాబెటిస్ రెండవది టైప్ 2 డయాబెటిస్. అయితే పిల్లల్లో డయాబెటిస్ వచ్చిందా లేదా అన్నది కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పిల్లలు తరచుగా అలసిపోవడం బలహీనతకు గురవడం అలసటగా ఫీల్ అవ్వడం ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. ఎందుకంటే ఇవి మధుమేహానికి సంకేతాలు కావచ్చు. అదేవిధంగా చిన్నపిల్లల్లో మధుమేహంతో బాధపడుతున్న వారిలో బరువులో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. డయాబెటిస్ సమస్య ఉంటే పిల్లలు కూడా త్వరగా బరువు పెరుగుతారు.

 

అంతేకాకుండా డయాబెటీస్ పిల్లల్లో క్లోమం తగినంతగా ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయదు. లేదా ఇన్సులిన్ ను సమర్థవంతంగా ఉపయోగిచనప్పుడు గ్లూకోజ్ ను శక్తిగా మార్చే ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. దీంతో వారి శరీరానికి కావాల్సిన శక్తి లభించదు. దాంతో అది శక్తి కోసం కొవ్వును, కండరాలను తినడం ప్రారంభిస్తుంది. నిద్ర, ఆహారపు అలవాట్లు కూడా మధుమేహానికి కారణమవుతాయి. తీవ్రమైన ఆకలి, విపరీతమైన దాహం, నిద్రలేమి వంటి సమస్యలన్నీ మధుమేమానికి సంకేతాలుగా చెప్పవచ్చు. తరచూ మూత్ర విసర్జన చేయడం అన్నది కూడా డయాబెటిస్ సమస్యకు లక్షణంగా చెప్పవచ్చు. అంతేకాకుండా కంటి చూపు మందగిస్తే డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించాలి. అంతేకాకుండా కొన్ని కొన్ని సార్లు మధుమేహం కంటి కటకాన్ని ఉబ్బిపోయేలా చేస్తుంది. దాని ద్వారా పిల్లలు స్పష్టంగా చూడలేరు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -