Anjali: అంజలికి పెళ్లైందా.. మొగుడు అమెరికాలో ఉన్నాడా?

Anjali: తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా రాణించలేరని అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. అయితే కొంత మంది మాత్రం అలా కాదు. ఇతర ఇండస్ట్రీలలో సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నారు. తెలుగు అమ్మాయి అయిన అంజలి తమిళ్ లో పలు సినిమాలు చేస్తూ దూసుకుపోతోందనే చెప్పాలి. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ అమ్మాయి అయిన అంజలి కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో ముందుగా ఎంట్రీ ఇచ్చింది. కోలీవుడ్ లో విజయం సాధించడంతో ఆతర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

 

తెలుగు టాప్ హీరోల్లో బాలయ్య, వెంకటేష్ సరసన అంజలి కనిపించింది. అంతేకాదు కుర్ర హీరోలతో కూడా జత కట్టింది. కోలీవుడ్ లో సీనియర్ హీరోలతో నటించడంతో పాటుగా పలు సినిమాల్లో ఐటెమ్స్ సాంగ్స్ చేసింది. హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే కొన్ని కాంట్రవర్సీల్లో అంజలి చిక్కుకుని కెరీర్ ను పాడు చేసుకుంది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ కు మకాం మార్చింది. వెబ్ సిరీస్ లు చేస్తూ అప్పుడప్పుడూ ఐటెం సాంగ్స్ లో మెరుస్తోంది.

 

అప్పట్లో అంజలి తమిళ హీరో జైతో ప్రేమలో ఉన్నట్లు పలు వార్తలు షికారు చేశాయి. ప్రేమలో ఉండటమే కాదు ఆయనతో పాటు సహజీవనం కూడా చేసిందని, వారిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని అందరూ అనుకున్నారు. అయితే ఏమైందో తెలియదు గానీ వారిద్దరూ విడిపోయారు. జై నుంచి దూరమయ్యాక అంజలి టాలీవుడ్ లోని ఓ స్టార్ రైటర్ తో సహజీవనం చేస్తున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా అంజలి ఓ వ్యక్తిని పెళ్లాడిందని, అమెరికాలో వీరి కాపురం సజావుగా సాగుతోందని పలు రూమర్లు హల్ చల్ చేస్తున్నాయి.

 

ఈ మధ్యనే చెన్నైలో ఓ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న అంజలి తనపై వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చింది. తాను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నానని చెప్పడంలో వాస్తవం లేదని తెలిపింది. అటువంటి పుకార్లను నమ్మొద్దని అభిమానులకు వెల్లడించింది. తాను పెళ్లి చేసుకుంటే అందరికీ చెప్పి చేసుకుంటానని తెలిపింది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -