Surya: సూర్యకు జరిగిన దారుణమైన అవమానమిదే.. అలాంటి స్థితి ఎదురైందా?

Surya: కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తండ్రి శివకుమార్ హీరో అయినప్పటికీ సూర్య మాత్రం ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ వైపు రావాలని అనుకోలేదట ఈయన ఏ రోజు కూడా తన తండ్రి షూటింగ్ చూడటం కోసం లొకేషన్ లోకి అడుగుపెట్టిన సందర్భాలు కూడా లేవు.ఇలా సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేకుండా తన చదువును చదువుకుంటూ ముందుకు కొనసాగుతున్నటువంటి సూర్య అనుకోని విధంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

ఈ విధంగా నటన పైన ఆసక్తి లేనటువంటి సూర్య ఇలా హీరోగా సక్సెస్ సాధించడానికి కారణం మరొక హీరో రఘువరన్ అని చెప్పాలి.హీరోగా తన తండ్రి శివకుమార్ కొనసాగుతున్న సమయంలో కొంతకాలానికి ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడ్డారు అయితే సినిమా ఇండస్ట్రీ అంటే ఏమాత్రం ఇష్టం లేనటువంటి సూర్య మాత్రం గార్మెంట్ బిజినెస్ ప్రారంభించారు. అయితే అది పెద్దగా లాభసాటిగా లేకపోయింది.

 

ఇలా తన తండ్రి అవకాశాలు కోల్పోవడంతో సూర్యను ఆర్థిక ఇబ్బందులు చుట్టూ ముట్టాయి.ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటం కోసమే ఆయన ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు అంతేకాకుండా ఒక రోజు రైలులో ప్రయాణం చేస్తున్న సమయంలో సూర్య నటుడు రఘవన్ కలిసి ప్రయాణం చేశారు అయితే సూర్య నిద్రపోతూ ఉండగా రఘువరన్ మాత్రం సూర్యను నిద్ర లేపారట.

 

ఇలా నిద్రపోతున్నటువంటి సూర్యను లేపి అసలు జీవితంలో నువ్వు ఏం సాధించావని ఇలా నిద్రపోతున్నాం. ఇంకా ఎన్ని రోజులని నీ తండ్రి పేరు చెప్పుకొని బ్రతుకుతావ్ అని అవమానించారట. దీంతో ఆయన చాలా బాధపడి ఎలాగైనా ఇండస్ట్రీలోకి రావాలని వివిధ భాష సినిమాలను చూసి ఏ సన్నివేశంలో ఎలా నటించాలి ఆ హావ భావాలు ఎలా పెట్టాలి అనే విషయాలను నేర్చుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారని తెలుస్తోంది.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -