Goat Milk: శరీరానికి పోషక విలువలు అందించే సంజీవని మేకపాలు!

Goat Milk: మనం ప్రతిరోజు కాఫీ ,టీ ,పాలు ఇలా ఏది తాగాలనుకున్న ఆవుపాలు లేదా గేదెపాలు వాడడానికి ప్రాధాన్యత ఇస్తాము. కానీ కొన్ని ప్రదేశాలలో మేక పాలు కూడా ఉపయోగిస్తారు. చాలామంది మేకపాలను తాగడానికి ఇష్టపడరు. కానీ వాటిలో ఉన్న పోషక విలువలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.

 

మేకపాలు అనేవి ఆవు పాలు ,గేదె పాలు దొరికినంత సులువుగా దొరకవు. అవి చాలా తక్కువ మోతాదులోనే దొరుకుతాయి. శరీరానికి అత్యవసరమైన పోషక విలువలు అందించే శక్తి మేకపాలకు మెండుగా ఉంది. మేక పాలు తాగే పిల్లల్లో ఎదుగుదల అద్భుతంగా ఉంటుంది అని నిపుణులు చెబుతారు. మేక పాలలో అధిక మోతాదులో ఉండే ప్రోటీన్ మరియు లాక్టోస్ గ్రోత్ హార్మోన్ కు ఎంతో అవసరమైనవి.

 

మేక పాలలో శరీరానికి అవసరమైన ఏ, డి , బి 12 వంటి విటమిన్స్ తో పాటు ఐరన్ ,జింక్ ,కాపర్ వంటి పోషక విలువలు కూడా సమృద్ధిగా ఉన్నాయి. మేకపాలు రెగ్యులర్ గా తీసుకునే వారికి రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతుంది. పైగా మేక పాలల్లో ప్రోటీన్లు కూడా ఎక్కువగా ఉండటం వల్ల గేదె పాలకు ప్రత్యామ్నాయంగా దీన్ని వాడవచ్చు.

 

మేక పాలు మన శరీరంలో యాంటీ బాడీస్ ని ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. అందుకే డెంగ్యూ బారిన పడిన రోగులు మేక పాలు తీసుకుంటే త్వరగా కోలుకునే అవకాశం ఉంది. మేక పాలలో ఎటువంటి యాంటీబయోటిక్స్ మరియు హార్మోన్స్ ఉండవు, కాబట్టి ఇది మన జీర్ణక్రియ పై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపవు.

 

ఆవు పాలతో పోలిస్తే మేక పాలల్లో ఎక్కువగా కాల్షియం ఉంటుంది అని ఎన్నో అధ్యయనాలలో తేలింది. మేక పాలు కొన్ని రకాల క్యాన్సర్ కణాలు శరీరంలో వృద్ది కాకుండా అరికట్టడంలో సహాయపడతాయి. ఒకప్పుడు గాంధీజీ కూడా ఎప్పుడూ మేకపాలన తాగడానికి ప్రాధాన్యత ఇచ్చేవాడట. కుదిరితే ఆరోగ్యకరమైన మేకపాలను మీ ఆహారంలో భాగంగా చేసుకుని చూడండి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -