Casting Couch: క్యాస్టింగ్ కౌచ్‌పై అన్నపూర్ణ షాకింగ్ కామెంట్స్ వైరల్!

Casting Couch: ప్రస్తుతం అన్నిరంగాల్లో క్యాస్టింగ్ కౌచ్ నడుస్తోంది. కానీ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే ప్రత్యేకంగా నిలుస్తోంది. క్యాస్టింగ్ కౌచ్‌కు సంబంధించిన సినీ ఇండస్ట్రీలోనే వార్తలు ఎక్కువగా వినిపిస్తాయి. క్యాస్టింగ్ కౌచ్ బారిన పడి.. చాలా మంది బలైపోయిన వారు ఉన్నారు. అయితే కొందరు క్యాస్టింగ్ కౌచ్‌కు దూరంగా ఉంటే.. మరికొందరు తప్పించుకుని తిరుగుతున్నారు. ‘Mee Too’ ఉద్యమం తర్వాత చాలా మంది హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ధైర్యంగా గళం విప్పుతున్నారు. టాలీవుడ్‌లోనూ చాలా మంది హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఈ విషయంపై మాట్లాడారు. క్యాస్టింగ్ కౌచ్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై నటి అన్నపూర్ణ స్పందించింది.

 

 

ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది అన్నపూర్ణ. ఆ తర్వాత సినిమాల్లో పెద్దగా ఆఫర్లు రాలేకపోయాయి. దాంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తోంది. స్టార్ హీరోలందరికీ నానమ్మ, అమ్మమ్మ, అత్త, తల్లి పాత్రల్లో నటిస్తోంది. ఇండస్ట్రీలో ఆమె చేయని పాత్రలే లేవు. ఏ క్యారెక్టర్‌లోనైనా ఇట్టే ఒదిగిపోతుంది. అందుకే ఇప్పటికీ సినిమాల్లో రాణించగలుగుతుంది. అలాగే బుల్లితెర కామెడీ షోలు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా స్పెషల్ గెస్టుగా వస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా అన్నపూర్ణ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె వ్యాఖ్యలు విన్న నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

 

 

ఈ సందర్భంగా అన్నపూర్ణ మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎప్పటి నుంచో కొనసాగుతోంది. దాన్ని నేను వ్యతిరేకించను. కానీ ఓ వైపు మాత్రమే తప్పు ఉంటుందని నేను అనుకోను. ఇండస్ట్రీలో అలాంటి వారు ఎవరైనా ఉంటే.. ముందే కమిట్‌మెంట్ ఇవ్వాలని అడుగుతారు. ఇద్దరికీ ఇష్టం ఉంటేనే తప్పు చేస్తారు. అంతే కానీ బలవంతంగా వెళ్తారని నేను అనుకోవడం లేదు. ఒక వేళ ఇష్టం లేకపోతే వెళ్లరు. ఫ్యామిలీ పరువును దృష్టిలో పెట్టుకుని వెళ్లని వారు చాలా మంది ఉన్నారు. అసలు ఇండస్ట్రీయే అవసరం లేదని దూరం అయిన వాళ్లున్నారు.’ అని సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఈ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -