IND vs BAN: పసికూన ముందు భారీ టార్గెట్. సెంచరీతో చెలరేగిన గిల్, పుజారా

IND vs BAN: బంగ్లాతో జరుగిన వన్డే సిరీస్ లో చతికిల పడ్డ భారత్.. టెస్ట్ సిరీస్ లో భాగంగా జరుగుతున్న మొదటి టెస్ట్ లో మాత్రం బాగా రాణిస్తుంది. తొలి టెస్టులో 2 వ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన టీమిండియా ప్రస్తుతం ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన ఇండియా టీమ్ 61.4 ఓవర్లలో 258 పరుగులు చేసింది. అప్పటికే మొదటి ఇన్నింగ్స్ లో పరుగులతో కలిపి మొత్తం 512 రన్స్ లీడ్ లో ఉన్నాయి. ఇక ఇప్పుడు బంగ్లాదేశ్ ముందు 513 పరుగులు ఛేదించాల్సిన భారీ టార్గెట్ ఉంది.

 

శతకాలు మోత.
స్థిరంగా రాణిస్తున్న శుభ్ మన్ గిల్ మరియు పుజారా ఇద్దరు సెంచరీలతో భారత్ భారీ స్కోర్ నమోదు చేయగలిగింది. గిల్ (152 బంతుల్లో 110 పరుగులు; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) మరియు పుజారా (130 బంతుల్లో 102 పరుగులు నాటౌట్; 13 ఫోర్లు) తో చెలరేగారు. దీనితో బంగ్లా బౌలర్లు బేజారయ్యారు. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న కేఎల్ రాహుల్ (62 బంతుల్లో 23) తో మళ్ళీ పేలవ ప్రదర్శన చేసాడు.

 

విరాట్ కోహ్లీ 19 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. పుజారా, గిల్ కలిసి రెండో వికెట్ కు 113 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పగా వీరిని కట్టడి చేయడంలో బంగ్లా బౌలర్లు విఫలమయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో ఖలీద్ అహ్మద్, మెహదీ హసన్ మిరాజ్ చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం మూడో రోజు ఆటలో ఇంకా 12 ఓవర్లు మిగిలాయి. ఏ ఇన్నింగ్స్ కు ముందు భారత బౌలర్లు చేసిన దాడికి బంగ్లా బ్యాటర్లు చేతులెత్తేశారు. బంగ్లా బ్యాట్స్ మెన్ లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు.

 

మూడో రోజు ఆట ప్రారంభానికి.. ఓవర్ నైట్ 133/8 స్కోరుతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కేవలం 17 పరుగులు మాత్రమే అదనంగా చేయగలిగి 150 పరుగులకు ఆలౌట్ అయిపోయింది. బంగ్లా బ్యాటర్లలో ముష్ఫికర్ రహీమ్ చేసిన 28 పరుగులే అత్యధిక వ్యక్తిగత పరుగులు కావడం వారి బ్యాటింగ్ స్థాయిని కళ్ళకు కడుతుంది. కుల్దీప్ యాదవ్ అద్భుత ప్రదర్శనతో 55.5 ఓవర్లకు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 150 పరుగులతో ముగిసింది. భారత్ దాటికి మ్యాచ్ డ్రా చేయడం కూడా బంగ్లాకు కష్టమేనని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -