Prabhas: ఆ హీరోయిన్ గురించి ప్రభాస్ అలా చెప్పారా?

Prabhas: సినిమా ఇండస్ట్రీలో ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. అందరి జీవితం ఒకేలా ఉండదు. హీరోల పొజిషన్ శాశ్వతం కాదని పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రూవ్ చేశాడనే చెప్పాలి. పెదనాన్న కృష్ణంరాజు వారసుడిగా సినీ ఇండస్ట్రీకి ప్రభాస్ పరిచయమయ్యాడు. ఆయన మొదటి సినిమా ఈశ్వర్ ఎంతో విజయం సాధించింది. అప్పటి నుంచి ప్రభాస్ అంచెలంచెలుగా ఎదుగుతూ పాన్ ఇండియా హీరో స్థాయికి చేరారు. ప్రతి సినిమాలో కూడా తన నటనలో మార్పును చూపుతూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హిట్స్, ప్లాప్స్ అంటూ తేడా లేకుండా ముందుకు సాగుతున్నాడు.

 

తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్2 షోకి వచ్చారు. ప్రభాస్ గెస్ట్ గా అన్ స్టాపబుల్ కు వెళ్లిన ఆ చిన్న ప్రోమో వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. ఒకటిన్నర నిమిషం కూడా లేని ఆ గ్లింప్సే సోషల్ మీడియాలో భారీ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇదే ఇలా ఉంటే మరికొన్ని రోజుల్లో విడుదల కానున్న ప్రోమో, ఆ తర్వాత స్ట్రీమింగ్ కానున్న ఎపిసోడ్ ఎంతలా దూసుకెళ్తాయో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆ వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తాయనడంలో సందేహం లేదు.

 

ఇకపోతే అన్ స్టాపబుల్ షోలో బాలయ్య సెలబ్రిటీలను అన్ని రకాల ప్రశ్నలతో ఆటాడుకుంటున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి పలు ప్రశ్నలను సంధిస్తున్నారు. ఈ తరుణంలోనే ప్రభాస్ గతంలో ఓ హీరోయిన్ ను మగరాయుడు అంటూ కామెంట్ చేశాడనే వార్త షికారు చేస్తోంది. ఇదే ప్రశ్నను బాలయ్య కూడా అడిగినట్లుగా సమాచారం.

 

ఆ ప్రశ్నే కాకుండా ప్రభాస్ తనకు అనుష్కకు పెళ్లి అంటూ వస్తున్న వార్తలపై కూడా క్లారిటీ ఇవ్వనున్నాడు. ఆ మగరాయుడు హీరోయిన్ ను చూస్తే మూడ్ కూడా రాదని ప్రభాస్ గతంలో కామెంట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా నుంచి ఆ హీరోయిన్ ను తప్పించినట్లుగా కూడా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇలాంటి మరిన్ని ప్రశ్నలకు ప్రభాస్ ఆ షోలో సమాధానాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ ఎపిసోడ్ కోసం అందరూ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -