Sports: ప్రెస్ మీట్ లో షాకింగ్ ప్రశ్న,ఇండియా ప్లేయర్ సమాధానం అదుర్స్!

Sports: తొట్ట తొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ని తృటిలో చేజార్చుకుంది టీమిండియా. న్యూజిలాండ్ జట్టు చేతిలో ఓడిపోయి ఛాంపియన్షిప్ కి ఒక అడుగు దూరంలోనే ఆగిపోయింది. అయితే వచ్చే ఛాంపియన్షిప్ ని ఎలాగైనా గెలవాలని అనుకుంటుంది టీమిండియా. దీంతో ఆడే అన్ని టెస్ట్ మ్యాచులు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగానే బంగ్లాదేశ్ తో తలపడుతుంది టీమిండియా. మొదటి టెస్ట్ లో ఇండియా మంచి పొజిషన్ లో ఉంది. బంగ్లాదేశ్ జట్టు ముందు 513 భారీ లక్ష్యాన్ని ఉంచింది ఇండియా.

 

బాల్ తోనే కాదు నోటితో కూడా సమాధానం ఇచ్చాడు!

ఇవాళ నాల్గవ రోజు. ఇంకొక రోజు ఆట మాత్రమే మిగిలింది బంగ్లాదేశ్ కి . అయితే అంత పెద్ద టార్గెట్ ని ఛేదించడం కష్టమనే చెప్పాలి. ఏదో అద్భుతం జరిగితే తప్ప బంగ్లాదేశ్ డ్రా కూడా చేసుకోలేదు. అయితే ఒక బంగ్లాదేశ్ విలేకరి ఒక విచిత్రమైన ప్రశ్న వేశారు. టీమిండియా ఆటగాడు కూడా అంతే ధీటైన సమాధానం ఇచ్చారు ప్రెస్ మీట్ లో.

 

స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అయిదు వికెట్స్ తీసి 40 పరుగులు కూడా చేశాడు. మ్యాచ్ అనంతరం ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడు కుల్దీప్ యాదవ్. అయితే ఒక బంగ్లాదేశ్ విలేకరి కుల్దీప్ ని అడిగాడు బంగ్లాదేశ్ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి అని. ఇలాంటి ప్రశ్నకి ధీటైన సమాధానం ఇచ్చారు కుల్దీప్ యాదవ్. తనైతే అలా జరగకూడదు అని కోరుకుంటున్నాను అని, ఒకవేళ ఎవరైనా బ్యాట్సమెన్ మూడొందల స్కోర్ చేస్తే గెలిచే అవకాశం ఉంది. అయితే టీమిండియా బౌలర్లు బంగ్లాదేశ్ ఆటగాళ్ళని అవుట్ చేయాలని చూస్తున్నాం అని అన్నాడు.

 

బంగ్లాదేశ్ విలేకరి అలాంటి సమాధానం ఉహించలేడం కాబట్టి ఒకసారి ఖంగు తిన్నారు. ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఇతరులు కూడా ఆశ్చర్యపోయారు ఈ సమాధానం విని. టీమిండియా అభిమానులు మాత్రం కుల్దీప్ యాదవ్ విలేకరికి గూబ పగిలిపోయే సమాధానం ఇచ్చాడు అని అంటున్నారు. అసలు ఇలాంటి ప్రశ్నలు ఎలా అడుగుతారు అని అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -