Love is blind: 52 ఏళ్ల బామ్మను పెళ్లాడిన 21 ఏళ్ల వ్యక్తి.. ప్రేమ గుడ్డిదని ఇందుకే అంటారేమో

Love is blind: ప్రేమ అనేది గుడ్డిది అంటారు. ప్రేమకు వయసు, ఆస్తి, అంతస్తూ ఏదీ తెలియదని ఇంకొందరూ అంటూ ఉంటారు. ఈ రోజుల్లో ప్రేమికులకు సంబంధించిన అనేక వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. అందులో కొన్ని వింతగాను, ఆశ్చర్యంగాను అనిపిస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఈ సంఘటన ప్రేమ గుడ్డిది అనడానికి సాక్ష్యంగా నిలిచిందని చెప్పడంలో సందేహం లేదు.

 

తాజాగా 21 ఏళ్ల యువకుడు 52 ఏళ్ల బామ్మను పెళ్లి చేసుకున్నాడు. అది కూడా ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు అది నిజమా ? కాదా? నమ్మలేకపోతున్నాం అని మరికొందరు అంటున్నారు.

 

ఇంతకీ ఏం జరిగిందంటే ఓ 21 ఏళ్ల యువకుడు తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇంత వరకూ బాగానే ఉంది. అయితే ఆ యువకుడు పెళ్లి చేసుకుంది అమ్మాయిని కాదని బామ్మను అని ఆ తర్వాత తెలిసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

 

ఆ యువకుడికి సంబంధించిన పెళ్లి వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. అసలు నీకు ఏం పోయే కాలం వచ్చిందిరా బాబు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రేమ గుడ్డిది అంటారు ఇందుకేనేమో కాబోలు అని మరికొందరు అంటున్నారు. మొత్తానికి ఈ యువకుడు 52 ఏళ్ల బామ్మను పెళ్లి చేసుకుంటే ఏదో తెలిసీ తెలియని వయసులో చేశాడనే అనుకుందాం. కానీ ఆ బామ్మకు ఏం పోయేకాలం. తన వయసులో అంత తక్కువ ఏజ్ యువకుడితో పెళ్లి అవసరమా అని మరికొందరు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. నెటిజన్లు ఎన్ని కామెంట్స్ చేసినా ఆ జంట మాత్రం పట్టించుకోవడం లేదు. ఇంకొందరు అయితే కేవలం యూట్యూబ్ వ్యూస్ కోసం వీరు దొంగ పెళ్లి చేసుకున్నారని, ఈ వీడియో నిజం కాదని కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -