Rakul Preet Singh: రకుల్ డ్రగ్స్ కేసులో చిక్కుకోవడం వెనుక అసలు రీజన్ ఇదేనా?

Rakul Preet Singh: టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది రకుల్ ప్రీత్ సింగ్. వరుస అవకాశాలతో దూసుకెళ్లిన ఈ భామ.. ఊహించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ క్రమంలో బాలీవుడ్‌పై కన్నేసిన ఈ భామ అక్కడే సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. అవకాశాలను బట్టి ఆయా ఇండస్ట్రీలలో సినిమాలు చేస్తూ వస్తోంది. అయితే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్‌పై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. అయితే ఎమ్మెల్యేల ఎర కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ సమన్లు జారీ జేసింది. అయితే అదే రోజు రకుల్ ప్రీత్ సింగ్‌కు కూడా సమన్లు జారీ చేయడంతో చర్చనీయాంశంగా మారింది.

 

 

రకుల్ ప్రీత్ సింగ్‌కు రోహిత్ రెడ్డికి మధ్య ఏమైనా డ్రగ్స్ లింకులు ఉన్నాయా? అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే వీరిద్దరికీ ఏ కేసులో నోటీసులు ఇచ్చారనే విషయంపై క్లారిటీ రాలేదు. రోహిత్ రెడ్డిపై ఇప్పటికే తొమ్మిది వరకు నేరారోపణ కేసులు ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో బెంగళూరులో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులోనూ రోహిత్ రెడ్డి హస్తం ఉందని తెలుస్తోంది. నైజీరియన్ అరెస్ట్ అవ్వడంతో గుట్టురట్టయిన ఈ వ్యవహారంలో రూ.కోట్ల విలువైన డ్రగ్స్ విదేశాల నుంచి వచ్చినట్లు నార్కోటిక్ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో సంబంధం ఉన్న హైదరాబాద్ వ్యాపారవేత్తలకు బెంగళూరు పోలీసులు విచారించారు. తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల హస్తం కూడా ఉందని సమాచారం. కానీ ఈ డ్రగ్ కేసులో తనకు సంబంధం లేదని రోహిత్ రెడ్డి ఆరోపిస్తున్నారు.

 

 

రకుల్ ప్రీత్ సింగ్‌కు ఇప్పటికే టాలీవుడ్‌ ప్రముఖులతో ముడిపడి ఉన్న డ్రగ్స్ కేసుపై విచారణ జరిపింది. 2017లో ఎక్సైజ్ అధికారులు నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ విచారణ జరిపింది. ఈ డ్రగ్ కేసులో కీలక నిందితుడైన కెల్విన్ విచారణలో రకుల్ పేరు బయటికి రావడంతో ఆమెను గతంలో ప్రశ్నించారు. సోమవారం మరోసారి ఈ అంశంపై విచారణ జరపనున్నట్లు సమాచారం. అయితే రకుల్‌కు ఓ ప్రముఖ రాజకీయ నేత కొడుకుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఆయనపై ఉన్న కోపంతో కొంతమంది రకుల్‌ను టార్గెట్ చేశారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

 

Related Articles

ట్రేండింగ్

Raghu Rama Krishnam Raju: ఉండిపై ఉడుం పట్టు పట్టిన రఘురామ కృష్ణంరాజు.. అసెంబ్లీలో జగన్ కు వణుకేనా?

Raghu Rama Krishnam Raju: రఘురాం కృష్ణంరాజు కి కూటమి తరపున టికెట్ రాదు అనే భావించిన వైసీపీ వర్గం వారు సంబరాలు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే అనూహ్యంగా తెదేపా...
- Advertisement -
- Advertisement -