Veerasimha Reddy: వీరసింహారెడ్డి బిజినెస్ లెక్కలివే.. రికార్డులు బద్దలవ్వాల్సిందే!

Veerasimha Reddy: నందమూరి నటసింహం బాలకృష్ణ వీర సింహారెడ్డి అనే సినిమా ద్వారా సంక్రాంతి బరిలో దిగనున్నారు. ఈ సినిమా జనవరి 12న థియేటర్లలో సందడి చేయనుంది. విడుదల తేది దగ్గరపడే కొద్దీ బాలయ్య అభిమానుల ఉత్సాహం రెట్టింపవుతూ వస్తోంది. అఖండ సినిమా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాలయ్య ఏ రేంజ్ సినిమా చేశారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా వీరసింహారెడ్డి సినిమాకు సంక్రాంతి సందర్భంగా గట్టి పోటీ కూడా ఉంది.

 

సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాతో పాటు దిల్ రాజు నిర్మాతగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న వారసుడు సినిమా కూడా విడుదల కాబోతోంది. ఈ సినిమాల మధ్య గట్టి పోటీ ఉండనుంది. దీనికి తోడు మరో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న తెగింపు సినిమా కూడా తెలుగులో విడుదల కానుంది. వారసుడు, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాల పోటీని వీర సింహారెడ్డి ఎలా తట్టుకుని విజేతగా నిలుస్తుందోనని మరికొందరు ఆలోచిస్తున్నారు. అయితే సినిమాపై ప్రి రిలీజ్ బ‌జ్‌ మాత్రం అదిరిపోతుందనే చెప్పాలి. ఈ సినిమా నుంచి ఇప్పటికే జై బాలయ్య సాంగ్, సుగుణసుందరి సాంగ్ విడుదలై యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి.

విడుదలైన ఈ రెండు పాటలు చూసి ఈ సినిమా అద్భుతంగా ఉంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అదేవిధంగా స్టిల్స్ తో పాటుగా సినిమా టైటిల్, బాలయ్య మాస్ లుక్స్ అందర్నీ కట్టిపడేస్తున్నాయి. ఎలివేషన్ల విషయంలో కూడా దర్శకుడు మలినేని గోపీచంద్ ఎక్కడా వెనక్కు తగ్గకుండా సినిమా చేసినట్లు తెలుస్తోంది.

 

వీరసింహారెడ్డి సినిమాకు రికార్డు స్థాయిలో ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ ప్రి రిలీజ్ బిజినెస్ జరిగిన సినిమాగా ఇది నిలిచింది. ఈ సినిమా కోసం బాలయ్య రు.12 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. అలాగే ట్రేడ్ వర్గాల సర్కిల్స్ లో నడుస్తున్న ప్రచారం ప్రకారంగా వీరసింహారెడ్డికి వరల్డ్ వైడ్ గా రూ.90 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం అందుతోంది. బాలయ్య అఖండ సినిమాకు రూ.60 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.200 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించింది. ఆ సినిమాతో పోలిస్తే వీర సింహారెడ్డి బిజినెస్ చాలా ఎక్కువగా జరిగినట్లుగా తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -