Balayya: మనోజ్ మౌనిక మ్యారేజ్‌కి బాలయ్య పెళ్లి పెద్దగా ఉండనున్నారా?

Balayya:మంచు మనోజ్ పెళ్లికి బాలయ్య సపోర్ట్ ఇవ్వనున్నారా? అవును ప్రస్తుతం టాలీవుడ్‌, ఏపీ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్‌గా నడుస్తోంది. బాలయ్య సపోర్ట్‌ కి, ఏపీ రాజకీయాలకు ఏం సంబంధం అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. మోహన్ బాబు రెండో కొడుకు మంచు మనోజ్.. దివంగత నేత భూమారెడ్డి రెండో కుమార్తె మౌనిక రెడ్డి ప్రేమించుకున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరిద్దరి పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది.

 

అయితే మంచు మనోజ్-మౌనిక రెడ్డి పెళ్లి చేసుకోవడం ఇరు కుటుంబాలకు ఇష్టం లేదు. దీంతో అప్పటి నుంచి ఇరు కుటుంబాలు వారిని దూరం పెట్టాయి. ఏడాదిగా చెన్నైలోనే కలిసి ఉంటున్నారు. అయితే రీసెంట్‌గా మనోజ్-మౌనికలు భూమారెడ్డి ఆయన భార్యకు నివాళులర్పించేందుకు భూమా ఘాట్‌కు వచ్చారు. అప్పుడు భూమారెడ్డి కూతురు, మౌనిక అక్క అఖిల.. వీరిద్దరిని చూడటానికి కూడా ఇష్టపడలేదట. వీళ్లు ఉన్నంత సేపు ఘాట్‌కు రాలేదని సమాచారం.

 

అయితే మౌనిక కూడా రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్క అఖిల (మాజీ మంత్రి)కు పోటీగా మౌనిక ఆళ్లగడ్డలో పోటీ చేయనున్నట్లు సమాచారం. అయితే అఖిలకు వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ వస్తుందా? రాదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి తరుణంలో మౌనిక మంచు ఫ్యామిలీ కోడలు అయితే.. రాజకీయాల్లో నుంచి పార్టీ టికెట్ ఈజీగా దొరికే ఛాన్స్ ఉంది. బాలయ్య మంచు ఫ్యామిలీకి చాలా క్లోజ్. మనోజ్‌ అంటే కూడా చాలా ఇష్టం.

 

అందుకే మనోజ్ నటించిన చాలా సినిమాల్లో బాలయ్య వాయిస్, స్పెషల్ రోల్స్ చేశారు. ఒకవేళ ఆళ్లగడ్డలో మౌనిక చక్రం తిప్పాలని అనుకుంటే.. బాలయ్య సపోర్ట్ దొరికే ఛాన్స్ ఉంది. పార్టీ తరఫు నుంచి మౌనికకు టికెట్ అందే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అందుకే మనోజ్-మౌనిక పెళ్లి విషయంతోపాటు రాజకీయ భవిష్యత్తుపై సాయం కోరనున్నట్లు సమాచారం. ఫిబ్రవరిలో పెళ్లయిన తర్వాత డైరెక్ట్ గా బాలయ్య ఆశీస్సులు తీసుకోనున్నారని, మనోజ్ సపోర్ట్ తో మౌనిక ఆళ్లగడ్డ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి ఆళ్లగడ్డ టీడీపీ నేతలు కూడా మద్దతు చూపుతున్నట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -