NTR: టీడీపీ తరపున ఎన్టీఆర్ ప్రచారం.. నిజమేంటంటే?

NTR: 2024 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేస్తారని, ఊరూరా తిరుగుతారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులో స్పష్టత ఎక్కడా కనిపించడం లేదు. టీడీపీ ఈ మధ్య వరుస అపజయాలతో ముందుకు సాగుతోంది. చాలా చోట్ల టీడీపికి వ్యతిరేకత ఉంది. అలాగే జనసేన పార్టీ కూడా బరిలోకి దిగింది. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే ప్రజలు అటువైపు మళ్లుతారనే ఆశ టీడీపి నాయకులకు ఎక్కువగా ఉంది. అందుకే ఎన్టీఆర్ వచ్చి పార్టీ రాజకీయాల్లో పాల్గొంటారని చెప్పుకుంటూ పోతున్నారు.

 

తాజాగా నందమూరి వంశంలోని డిజాస్టర్ సినిమాల హీరో అయిన తారకరత్న ఈ సారి సినిమాల కంటే ఎక్కువగా రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నారు. కెరీర్ మొదట్లో ఈ హీరో 9 సినిమాలను ఒకేసారి చేశారు. అప్పట్లో ఆ ఘనత సాధించింది ఈ హీరోనే అని చెప్పాలి. అయితే ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా తప్పా తన కెరీర్ లో మరే సినిమా కూడా హిట్ కాలేదు. మంచి సినిమాలు చేయలేక చతికిల పడ్డాడు. ఆయన సినిమాలను ప్రజలు ఆదరించలేకపోయారు. అయితే తెలుగుదేశం పార్టీ ప్రచారాల్లో ఆయన బాగా మెరుస్తూ ఉంటారు.

 

తాజాగా గుంటూరుజిల్లా పెదనందిపాడులో తాతయ్య ఎన్టీఆర్ విగ్రహాన్ని తారకరత్న ఆవిష్కరించి ఓ విషయాన్ని తెలిపాడు. తాను కూడా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లుగా తెలియజేశాడు. మామయ్యకు అండగా ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని తెలిపాడు. తారకరత్న పోటీచేసినా కూడా కొన్నిచోట్ల అభ్యర్థులకు కూడా దిక్కులేని స్థితిలో టీడీపి ఉందని పలువురు అంటున్నారు.

 

అలాగే తారకరత్న మాట్లాడుతూ వచ్చే ఎన్నికల ప్రచారానికి తన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ‘వీలును బట్టి ’వస్తారని తారకరత్న ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ ను తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నారు. 2018 ఎన్నికల్లో తన సొంత సోదరిని చంద్రబాబు కూకట్ పల్లి బరిలో దింపినా కూడా ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు అటువైపు చూడలేదు. అలాంటిది చంద్రబాబు కోసం ఎన్టీఆర్ వస్తారని అనుకోలేము. అయినా జూనియర్ ఎన్టీఆర్ వీలును బట్టి ప్రచారానికి వస్తారని ధ్రువీకరించడానికి, ఈ నందమూరి తారకరత్న ఆయనకు మేనేజరా? పీఆర్వోనా? అని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -