Tollywood: ఈ హీరోయిన్ జీవితంలో అలాంటి చేదు అనుభవాలు ఉన్నాయా?

Tollywood: అన్ని రకాల ఇండస్ట్రీలలో క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఉంది. ముఖ్యంగా సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా కనిపిస్తుంది. నాలుగైదు ఏళ్లుగా అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోయిన్లు, సింగర్లు, బుల్లితెర నటీమణులు తమ కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి మాట్లాడుకొచ్చారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్, రాధిక ఆప్టే వంటి స్టార్ హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్‌పై గళమెత్తారు. ఆ తర్వాత ఒక్కొక్కరిగా తమ సమస్యలు చెప్పుకొచ్చారు. తాము కూడా ఆ సమస్యను ఎదుర్కొన్నట్లు పలువురు హీరోయిన్లు బయటికొచ్చారు. టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ తాప్సితోపాటు మరికొంత మంది హీరోయిన్లు లైంగిక వేధింపులకు గురైనట్లు పేర్కొన్నారు. అలాగే సింగర్ చిన్మయి, నటి శ్రీరెడ్డి కూడా క్యాస్టింగ్ కౌచ్‌పై భారీ ఎత్తున గళం ఎత్తారు. మరోవైపు శాండిల్‌వుడ్‌లోనూ ఎంతో మంది హీరోయిన్లు లైంగిక వేధింపులకు గురయ్యారు.

 

 

ఈ క్రమంలో ఓ నార్త్ హీరోయిన్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని చెప్పుకొచ్చింది. మరాఠీ హీరోయిన్ తేజస్విని పండిత్.. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడినట్లు పేర్కొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకి అటెండ్ అయిన ఈ భామ.. సంచలన వ్యాఖ్యలు చేసింది. అవకాశాల పేరుతో దర్శకులు, నిర్మాతలు వాడుకుంటారని, తాను అద్దెకుంటున్న ఇంటి యజమాని కూడా లైంగిక వేధింపులకు గురి చేశాడని తేజస్విని పండిత్ చెప్పారు. అయితే నటి జ్యోతిచంద్ర కుమార్తెనే తేజస్విని పండిత్. గతంలో తాను ఓ కార్పొరేటర్ ఇంట్లో అద్దెకు ఉండేది. ఒకసారి ఆమెను డైరెక్ట్ గా రూమ్‌కి రమ్మని చెప్పాడట. దాంతో అప్పటికప్పుడే అపార్ట్‌ మెంట్ ఖాళీ చేసి బయటికి వచ్చేసినట్లు తేజస్విని చెప్పారు. పూణెలో ఓ అపార్ట్ మెంట్‌లో అద్దెకు ఉంటూ.. రెండు సినిమాల్లో నటించానని తెలిపింది. ఖర్చుల కోసం ఉద్యోగం చేసే దానినని తేజస్విని అన్నారు. ఆఫీస్‌లో కూడా లైంగిక వేధింపులకు గురైనట్లు పేర్కొన్నారు. ఆఫీల్‌లో ఓ వ్యక్తి తన దగ్గరికి వచ్చి.. రూమ్‌కి వస్తావా? అని అడిగాడని, అప్పుడు టేబుల్‌పై ఉన్న గ్లాస్ వాటర్ అతడి మొఖంపై కొట్టి వెళ్లిపోయినట్లు తెలిపారు.

 

Related Articles

ట్రేండింగ్

Nara Chandrababu Naidu: చంద్రబాబు స్టామినాకు ఫిదా అవ్వాల్సిందే.. ఏడు పదుల వయస్సులో చెలరేగిపోతున్నారుగా!

Nara Chandrababu Naidu:  ఏపీలో ఎన్నికలవేళ పార్టీ ప్రచారాల జోరు ఊపందుకున్న నేపథ్యంలో అందరి దృష్టి చంద్రబాబు నాయుడు మీద పడటం గమనార్హం. చంద్రబాబు నాయుడు లో అంత ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా.....
- Advertisement -
- Advertisement -