Relationship: లైంగిక జీవితం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

Relationship: సాధారణంగా పెళ్లయిన భార్యాభర్తలు లైంగిక జీవితం బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. చాలామంది లైంగిక జీవితం అనగానే కేవలం దంపతుల మధ్య సెక్స్ లైఫ్ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. సెక్స్ లో ఎక్కువసేపు పాల్గొంటే వారి లైంగిక జీవితం ఆరోగ్యంగా ఉంది అని ఫీల్ అవుతూ ఉంటారు. అయితే దాని గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం మరొకటి ఉంది అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. లైంగిక శ్రేయస్సు, పోషకాహారం ఇవి రెండూ కూడా నేరుగా ఒకదానితో మరొకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి.

 

ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాల కోసం ప్రాసెస్ చేసిన ఆహారాన్ని కాస్త దూరం చేయడం వల్ల హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవచ్చు. జీవితం ఆరోగ్యంగా ఉండాలి అంటే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, ఫ్లేవనాయిడ్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి. ఆల్కహాల్ , నికోటిన్ మానుకోండి. ఆల్కహాల్ మీకు ఆనందాన్ని ఇస్తుంది. కానీ అది లైంగిక జీవితాన్ని నిరుత్సాహపరుస్తుంది. ఇది ఈస్ట్రోజెన్ స్థాయిలను తగ్గిస్తుంది. మానసిక స్థితిని తగ్గిస్తుంది. కాబట్టి పొగ, మద్యానికి దూరంగా ఉండటం లైంగిక ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే లైంగిక నా జీవితం ఆరోగ్యం విషయంలో మీ కోరికలను పరిమితులను మీ జీవిత భాగస్వామికి తెలియజేయాలి.

 

మీ మనసులోని మాట చెప్పినప్పుడే మీకు ఏం కావాలి అన్నది వారికి స్పష్టంగా అర్థం అవుతుంది. నీకు నచ్చిన వాటి గురించి మాత్రమే కాకుండా నచ్చని వాటి గురించి కూడా మీరు మీ భాగస్వామికి తెలియజేయాలి. అలాగే భాగస్వామి అవసరాలను కూడా అడిగి తెలుసుకోవాలి. వారికి కూడా భిన్నమైన రుచులు ఆలోచనలు ప్రాధాన్యతలు ఉంటాయి. లైంగిక శ్రేయస్సు అంటే ఆహ్లాదకరమైనది మాత్రమే కాదు రక్షణ కూడా చాలా అవసరం. కండోమ్ వాడటం వల్ల ఇతర లైంగికంగా సక్రమించే వ్యాధులు రాకుండా ఉంటాయి. సరైన మార్గంలో ఉపయోగించినట్లయితే, కండోమ్‌లు చాలా లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు, అవాంఛిత గర్భాన్ని నిరోదిస్తాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: షర్మిలకు డిపాజిట్ రాదట.. బాధగా ఉందట.. జగన్ మొసలి కన్నీరు వెనుక లెక్కలివేనా?

CM Jagan: రాజకీయాలు కుటుంబ సభ్యులను సైతం బద్ధ శత్రువులుగా మారుస్తుందని విషయం మరొకసారి రుజువయింది. ఒకప్పుడు అన్యోన్యంగా ఉన్న వైఎస్ కుటుంబం ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారిపోయి బహిరంగంగానే ఒకరిని ఒకరు...
- Advertisement -
- Advertisement -