Dhamaka: ధమాకాలో శ్రీలీల నటించడం వెనుక ఇంత జరిగిందా?

Dhamaka: ఎనర్జిటిక్ హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల జంటగా ధమాకా అనే సినిమా తెరకెక్కుతోంది. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 23న విడుదల కానుంది. ఈ తరుణంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ భారీగా సాగుతున్నాయి. శ్రీలీల కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ సందడి చేస్తోంది.

 

ధమాకా సినిమా విడుదలవుతున్న సందర్భంగా ఈ మూవీకి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమాలో డైరెక్టర్ త్రినాధ్ తావు నక్కిన మొదటగా హీరోయిన్ గా హన్సికను అనుకున్నారట. ఇదివరకే తెరపై హన్సిక, రవితేజ జంటకు మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే వీరు చాలా సినిమాల్లో నటించి బ్లాక్ బాస్టర్ పెయిర్ అనిపించుకున్నారు. అందుకే ధమాకాలో హన్సిక నటిస్తే మరింత బజ్ క్రియేట్ అవుతుందని అనుకుని ఆమెను అప్రోచ్ అయ్యారంట. కానీ సినిమాను ఆమె రిజెక్ట్ చేసిందని సమాచారం.

 

అయితే సినిమా ప్రారంభానికి ముందే హన్సిక పెళ్లి డేట్ ను ఫిక్స్ చేసుకొని ఉండడం వల్ల రవితేజ సినిమా షూటింగ్స్ లో పాల్గొంటే తాను తన పెళ్లి పనులను చూసుకోలేని ఆమె చెప్పకుండానే సున్నితంగా సినిమాను రిజెక్ట్ చేసిందట. అయితే రవితేజ, హన్సిక ఇద్దరూ మంచి దోస్తులని అందరికీ తెలుసు. అయినా కానీ హన్సిక రవితేజతో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఒకానొక టైంలో రవితేజ కన్నీళ్లు పెట్టుకున్నారని టాక్ వినిపిస్తోంది.

 

అయితే పెళ్లి విషయం తెలిసాక రవితేజ అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది. హన్సిక వదులుకున్న ఈ పాత్రలో శ్రీలీల ఏమేరా నటించి మెప్పిస్తుందో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకూ ఆగాల్సిందే. ఇటీవలె హన్సిక వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. తన పెళ్లి పనుల వల్లే హన్సిక ధమాకా సినిమాలో నటించే అవకాశాన్ని వదులుకున్నట్లు తెలుస్తోంది. ధమాకా చిత్ర యూనిట్ మొదట బాధపడ్డా ఆ తర్వాత హన్సిక పెళ్లి గురించి తెలిసి ఆనంద పడ్డారట. రవితేజ కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -