Devotional: పారిజాత మొక్కలు నాటడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?

Devotional: వాస్తు శాస్త్ర ప్రకారం చాలామంది ఇంట్లో ఎన్నో రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. అయితే ఈ మొక్కలను, చెట్లను సరైన దిశలో ఉంచడం కోసం ఎన్నో రకాల నియమాలను చెప్పబడిన విషయం తెలిసిందే. వాస్తు శాస్త్రంలో ఇటువంటి వాటి కోసం ఎన్నో విషయాలను పొందుపరిచారు. కొన్ని రకాల మొక్కల్లో నాటుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించడంతోపాటు ఐశ్వర్యం కలుగుతుంది. అటువంటి వాటిలో పారిజాతం మొక్క కూడా ఒకటి. పారిజాతం పుష్పం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. పారిజాత మొక్క పువ్వులు చాలా సువాసనగా ఉంటాయి.

 

ఈ పువ్వులు రాత్రిపూట మాత్రమే వికసించి అవంతట అవే రాలిపోతూ ఉంటాయి. అయితే ఈ మొక్కలు నాటడం ద్వారా ఇంట్లో శాంతి నెలకొంటుంది. హర్సింగార్ లేదా పారిజాతం పువ్వుల వాసన చాలా బాగుంటుంది. ఇది ఒత్తిడి,నిద్రలేమి వంటి వాటిని తొలగిస్తుంది. ఈ పువ్వుల సువాసన మానసిక సమస్యలను నయం చేసి మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తుంది. ఆరోగ్యం కోసం ఇంట్లో పారిజాతం మొక్కను నాటడం వల్ల ఆ ఇంట్లోని వారు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఈ పారిజాత మొక్కలను ఎప్పటినుంచో ఆయుర్వేదంలో వినియోగిస్తూనే ఉన్నారు.

 

ఆయుర్వేదంలో పారిజాత పుష్పాలతో అనేక రకాల వ్యాధుల నివారణకు మందులు తయారు చేస్తారు. ఇకపోతే ఏ దిశలో నాటాలి అన్న విషయానికి వస్తే.. ఇంట్లో పారిజాత మొక్కను నాటడానికి వాస్తు శాస్త్రంలో ఎన్నో విషయాలను తెలిపారు. ఇంట్లో నెగటివ్ ఎనర్జీని పోగొట్టి, పాజిటివ్ ఎనర్జీ ప్రవహించాలంటే పారిజాత మొక్కను ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో నాటాలి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -