Rajini Kanth: రజనీ జీవితాన్ని మార్చేసిన అమ్మాయి ఎవరో మీకు తెలుసా?

Rajini Kanth: సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి అందరికీ తెలుసు. ఆయన హీరోకాక ముందు బెంగళూరులో బస్సు కండక్టరుగా పనిచేసేవారు. ఆ రోజుల్లో ఎంబీబీఎస్ చదువుకునే ఓ అమ్మాయి రోజూ రజనీకాంత్ ఉండే బస్సు ఎక్కుతుండేది. అలా రజనీకి ఆ అమ్మాయికి మధ్య పరిచయం పెరిగి ఒకరినొకరు ఇష్టపడ్డారు కూడా. రజనీకాంత్ బస్సు కండక్టరుగా ఉంటూనే నాటకాలు వేసేవారు. ఓ రోజు ఆ అమ్మాయి కూడా రజనీ నాటకం చూసి చాలా సంతోషపడింది. ఆ సమయంలో రజనీకి ఓ గిఫ్ట్ కూడా ఇచ్చింది.

 

రజిని కి చెన్నైలోనే అడ్డయ్యర్ ఇన్స్టిట్యూట్ కు రావాల్సిందిగా ఒక లెటర్ రాసి ఉంది. కానీ ఆ ఇనిస్టిట్యూట్ కు రజనీ అప్లై చేయకుండా లెటర్ ఎలా వచ్చిందని అనుకున్నారట. కానీ బస్సులోని అమ్మాయి లెటర్ వచ్చిందా అని అడిగిందట. ఆయన ఆశ్చర్యపోయి నువ్వే అప్లై చేసావా అని అడిగితే ఆమె అవునని సమాధానం చెప్పిందట. ఆ ఇనిస్టిట్యూట్ కు వెళ్లి జాయిన్ అవ్వమని రజనీతో ఆ అమ్మాయి చెబితే అందుకు కావలసిన డబ్బులు లేవని రజిని అన్నాడట.

 

ఆ సమయంలో ఆ అమ్మాయే 500 రూపాయలు ఇచ్చి పంపిందట. ఆమె పట్టుబట్టి రజినికాంత్ ను ఫిలిం ఇన్స్టిట్యూట్ కు పంపిందట. ఆ తర్వాత రజిని మళ్ళీ అదే బెంగళూరు వచ్చి ఆ బస్సులోనే రెండు రోజులు పాటు ఆమె కోసం చూసినా కనిపించలేదని తెలిసి అడ్రస్ కనుక్కున్నారట. తీరా అక్కడికి వెళ్తే వారం రోజుల కిందటే అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోయిందని సమాచారం. అప్పటి నుంచి ఇప్పటివరకు రజినీకాంత్ ఆమె కోసం ఎదురు చూస్తూ బాధపడుతున్నారట.

 

అంత గొప్ప హీరో అయిన రజనీకాంత్ వెలుగు లోకి రావడానికి ఆమే కారణం అని పలు ఇంటర్వ్యూలలో రజనీ చెప్పేవారు. ఆమె కోసం చాలా ప్రయత్నించినా కనిపించలేదని, అదెంతో తనను బాధపెడుతోందని ఇప్పటికీ రజనీకాంత్ ఆలోచిస్తూనే ఉన్నారట. మొత్తానికి సూపర్ స్టార్ రజనీకాంత్ ని వెలుగులోకి తెచ్చి ఆమె కనుమరుగైపోయింది.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -