NTR 32: వామ్మో.. తారక్ ఇలాంటి విచిత్రమైన కథకు ఓకే చెప్పారా?

NTR 32: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన విషయం తెలిసిందే. కాగా జూనియర్ ఎన్టీఆర్ కు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

 

కాగా తెలుగులో సింహాద్రి, యమదొంగ, నాన్నకు ప్రేమతో, బృందావనం,టెంపర్,స్టూడెంట్ నెంబర్ వన్,అదుర్స్, అరవింద సమేత ఎన్నో మంచి మంచి సినిమాలలో నటించి హీరోగా తన తండ్రి ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అంతేకాకుండా ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో ఒకరిగా రాణిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలె ఆర్ఆర్ఆర్ ప్రేక్షకులను పలకరించిన జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాలపై దృష్టిని పెట్టాడు. అయితే ఎన్టీఆర్ తదుపరి సినిమా ఎలా ఉండబోతోంది?ఏ దర్శకుడు తో చేయబోతున్నాడు?అందులో ఏ హీరోయిన్ నటించబోతోంది? ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

 

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అయ్యి చాలా రోజులు అవుతున్నా ఇప్పటివరకు ఎన్టీఆర్ తదుపరి సినిమాకు సంబంధించిన వార్తలు వినిపించడం లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఎన్టీఆర్ 32వ సినిమాకు సంబంధించి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అవేమిటంటే జూనియర్ ఎన్టీఆర్32 సినిమా ప్రేతాత్మల కథతో తెరకెక్కుతోందట. టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ ఈ సినిమాకు డైరెక్టర్ అని ఆత్మలతో నిండిన ఊరిలో హీరో చిక్కుకుపోతే ఎదురైన సమస్యలేంటి? ఆ సమస్యలను ఎలా పరిష్కరించుకున్నాడనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ వార్త విన్న పలువురు అభిమానులు ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -