SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా అతడేనా.. అందరి చూపు మయాంక్ అగర్వాల్ పైనే

SRH: ఐపీఎల్ 2023 మినీ వేలం జోరుగా సాగుతోంది. టీమిండియా వెటరన్ బ్యాట్స్‌మన్ అయిన మయాంక్ అగర్వాల్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ.8.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ తరుణంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్‌ జట్లతో పోటీ పడి మరీ సన్‌రైజర్స్ సంస్థ మయాంక్‌ను ఎంచుకోవడం విశేషం. కెప్టెన్‌గా మయాంక్ పనికొస్తాడనే ఉద్దేశంతోనే సన్‌రైజర్స్ యాజమాన్యం మయాంక్ కోసం ఇంత భారీ ధర చెల్లించినట్లు సమాచారం.

గత కొన్ని రోజులుగా సన్‌రైజర్స్‌ టీమ్ లో ఇండియన్ బ్యాటర్లు కొరత ఉండటం తెలిసిందే. దాంతో పాటుగా మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్థానాన్ని భర్తీ చేయగల ఓపెనర్ అవసరం కూడా ఈ జట్టుకు ఎంతైనా ఉంది. గత సీజన్‌లో చూస్తే కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఓపెనర్‌గా బరిలోకి దిగినా అంతగా ఆకట్టుకోలేక చతికిల పడ్డాడు. దీంతో సన్ రైజర్స్ జట్టు ఘోర పరాభవాలను చవిచూసింది.

ఈసారి పూర్తిగా బ్యాటింగ్‌ను బలోపేతం చేయడంపై సన్ రైజర్స్ జట్టు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్లుగానే వేలంలో తనకు కావాల్సిన వారిని మాత్రమే ఎంచుకుంటూ వస్తోంది. మయాంక్ తో పాటుగా ఇంగ్లండ్ యువ బ్యాటర్ అయిన హరీ బ్రూక్ కోసం రూ.13.25 కోట్లు చెల్లించి భారీ ధరకు తీసుకుంది. దీంతో మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, హరీ బ్రూక్, గ్లేన్ ఫిలిప్స్‌తో సన్‌రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్ ఈ సారి పర్ ఫెక్ట్ గా ఉందని చెప్పాలి.

అలాగే భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, మార్కో జాన్సెన్, కార్తీక్ త్యాగీలతో బౌలింగ్ విభాగం సన్ రైజర్స్ బాగానే ఏర్పాటు చేసుకుంది. ఇక జట్టులో వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, ఆదిల్ రషీద్‌ వంటి అద్భుత స్పిన్నర్లు కూడా ఉన్నారు. ఇంతమంది ఉన్నా జట్టును నడిపించేవారి కోసం సన్ రైజర్స్ చూస్తోంది. అందుకే ఎయిడెన్‌ మార్క్‌రమ్, మయాంక్ అగర్వాల్, భువనేశ్వర్ కుమార్, అభిషేక్ శర్మలు కెప్టెన్సీ రేసులో ఉండటంతో సన్ రైజర్స్ పరిశీలిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Tuni Assembly Constituency: తుని నియోజకవర్గంలో కూటమికి తిరుగులేదా.. యనమల కుటుంబానిదే విజయమా?

Tuni Assembly Constituency: తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో కూటమిలో కాస్త ఆ నియోజకవర్గం సీటు ఎవరిదనే విషయంపై కాస్త గందరగోళం ఉండేది. అయితే పంపకాలలో తుని నియోజకవర్గం తెదేపాకి దక్కింది. ఈ...
- Advertisement -
- Advertisement -