KL Rahul: రెండో టెస్టులో టీమిండియా విజయం..అయితే ఆ పొరపాట్లు చేశామన్న రాహుల్

KL Rahul: భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ను భారత బౌలర్లు 227 పరుగులకే ఆలౌట్ చేయడంతో అందరూ టీమిండియా గెలవడం ఖాయమని ముందే అనుకున్నారు. తొలి ఇన్నింగ్స్ లో బౌలర్లు ఉమేష్ యాదవ్, అశ్విన్ చెరో నాలుగు వికెట్లతో ప్రత్యర్థులను కట్టడి చేశారు. చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చిన జయదేవ్ ఉనద్కత్ కూడా రెండు వికెట్లు తీయడం విశేషం. అయితే ఆ తర్వాత బరిలోకి దిగిన భారత బ్యాటర్లు కాస్త తడబడ్డారనే చెప్పాలి. అయితే రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా ఆడటంతో 314 పరుగులు టీమిండియా చేసింది.

ఇకపోతే రెండో ఇన్నింగ్స్‌లో భారత్ కు కొంత కష్టంగా మారింది. పిచ్ పూర్తిగా బౌలింగ్‌కు సహకరించడం ప్రారంభమవ్వడంతో మ్యాచ్ మరో మలుపు తిరిగింది. దీంతో భారత్ ముందు 145 పరుగుల టార్గెట్ ను బంగ్లా నిలిపింది. టార్గెట్ చిన్నదే అయినప్పటికీ పిచ్ నుంచి బౌలర్లకు పూర్తి సహకారం అందడంతో బ్యాటింగ్ చాలా కష్టం అయ్యింది.

తక్కువ పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బ ఎదురైంది. ఫామ్ లేక తంటాలు పడుతున్న కెప్టెన్ కేఎల్ రాహుల్ 2 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత కాసేపటికే పుజారా 6 పరుగులు చూసి అవుట్ అయ్యాడు. శుభ్‌మన్ గిల్ కూడా 7 రన్స్ మాత్రమే చేయగలిగాడు. కోహ్లీ క్రీజులోకి వచ్చి కేవలం ఒక్క పరుగుకే పెవిలియన్ బాట పడ్డాడు.

తమ టీమీ ఎక్కువ వికెట్లు కోల్పోయిందని కెప్టెన్ రాహుల్ తెలిపారు. తమ టీమ్ కొన్ని పొరపాట్లు చేసిందని, భవిష్యత్తులో అలాంటి పరిస్థితి ఎదురైతే ఆ పొరపాట్లు మళ్లీ రిపీట్ కాకుండా చూసుకునేందుకు ప్రయత్నిస్తామని రాహుల్ వెల్లడించారు. అశ్విన్, అయ్యర్ కలిసి 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో టీమిండియా 3 వికెట్ల తేడాతో రెండో టెస్టులో విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసినట్లైయ్యింది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -