Cricket: లంకతో సిరీస్‌కు మొండిచెయ్యి.. ధవన్ పని అయిపోయిందా?

Cricket: లెఫ్టాండర్లకు క్రికెట్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్యాటింగైనా, బౌలింగైనా, ఫీల్డింగైనా ఎడమ చేతి వాటం ఆటగాళ్లు తమదైన శైలితో వాటిని మరింత ప్రత్యేకంగా మార్చేస్తారు. సచిన్ బ్యాటింగ్ చూసేందుకు ఎంత ఆతృతగా ఎదురు చూస్తుంటామో.. బ్రియాన్ లారా ఆటను చూసేందుకూ అంతే వెయిట్ చేస్తుంటాం. లారా, గిల్ క్రిస్ట్, యువరాజ్ సింగ్ లాంటి ఆటగాళ్ల సొగసైన శైలి, షాట్లు ఆటకే అందాన్ని తీసుకొచ్చాయి.

 

టీమిండియాకు యువరాజ్, సురేష్ రైనా, గౌతం గంభీర్ తర్వాత దక్కిన మరో మంచి ఆటగాడిగా శిఖర్ ధవన్ ను చెప్పుకోవచ్చు. ఓపెనింగ్ పొజిషన్ లో దిగి బౌలర్లను చితక్కొట్టడంలో ధవన్ స్టయిలే వేరు. బౌండరీల మీద బౌండరీలు కొడుతూ బౌలర్లను సెటిల్ కాకుండా చేయడంలో అతడు దిట్ట. ఇలాంటి ఆటతీరుతో వన్డేలు, టీ20లతో పాటు టెస్టుల్లోనూ జట్టుకు బోలెడు విజయాలు అందించాడతడు. అందుకే అభిమానులు అతడ్ని గబ్బర్ అని ముద్దుగా పిలుస్తుంటారు. అతడి యాటిట్యూడ్ అదే విధంగా ఉంటుంది.

 

కొన్నాళ్లుగా ధవన్ వరుసగా విఫలమవుతున్నాడు. టీ20లకు ఎప్పుడో దూరమైన అతడు.. వన్డేల వరకు మళ్లీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. కొన్ని సిరీస్ ల్లో టీమ్ కు సారధిగానూ వ్యవహరించాడు. అయినప్పటికీ త్వరలో శ్రీలంకతో జరగనున్న వన్డే సిరీస్ కు మాత్రంలో టీమిండియాలో చోటు నిలుపుకోలేకపోయాడు. బంగ్లాదేశ్ తో సిరీస్ లో ఫెయిలైన అతడిపై సెలెక్టర్లు వేటు వేశారు.

 

మళ్లీ జట్టులోకి వస్తాడా?
లంకతో సిరీస్ లో ఎంపిక చేయకపోవడంతో ధవన్ కెరీర్ దాదాపుగా ముగిసినట్లేనని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఈ సిరీస్ లో రోహిత్ కెప్టెన్సీలో ఆడనున్న టీమిండియాకు హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. బంగ్లా మీద డబుల్ సెంచరీ బాదిన ఇషాన్ కిషన్ వన్డే సిరీస్ కు ఏకైక స్పెషలిస్టు కీపర్ గా సెలెక్ట్ అయ్యాడు. జనవరి 3, 5, 7 తేదీల్లో ముంబై, పుణె, రాజ్ కోట్ ల్లో ఈ మూడు వన్డేలు జరగనున్నాయి. మరి, జట్టులో చోటు కోల్పోయిన ధవన్.. ఐపీఎల్లో రాణించి తిరిగి పునరాగమనం చేస్తాడేమో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -