Salem: చిన్నారులకు షుగర్.. బాధ తట్టుకోలేక కుటుంబం మొత్తం ఆత్మహత్య?

Salem: ఈ మధ్యకాలంలో చాలామంది రెప్పపాటు కాలంలో ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్యలకు బాధపడడం చంపడం లాంటివి చేస్తున్నారు. మరిముఖ్యంగా ఆత్మహత్యలకు ఎక్కువగా పాల్పడుతున్నారు. కష్టం వచ్చిందని మందలించారని, ఆర్థిక సమస్యలని ఇలా ఎన్నో కారణాలవల్ల వారి వందేళ్ళ జీవితానికి ముగింపు పలుకుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. తమిళనాడులోని సేలంకు యువరాజ్,పాన్ విళి దంపతులు చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. వీరికి నితీషా,అక్షర అనే ఇద్దరు కూతుళ్లు జన్మించారు.

 

పుట్టిన పిల్లలను చూసుకుంటూ ఈ దంపతులు జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతూ వచ్చారు. ఇక భర్త స్థానికంగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇలా ఎంతో అనందంగా సాగుతున్న సంసారంలో మూడేళ్ల కిందట పెద్ద కూతురు నితీషా షుగర్ బారిన పడింది. దాంతో తల్లిదండ్రులు కుమార్తెకు అనేక ఆస్పత్రుల్లో చూపించి చికిత్స అందిస్తున్నారు. పెద్ద పాపకి షుగర్ వ్యాధి వచ్చి బాధపడుతున్న ఆ దంపతులకు చిన్న కూతురు అక్షరకు కూడా మూడు రోజుల కింద షుగర్ వ్యాధి బారిన పడినట్లు వైద్యులు నిర్ధారించడంతో వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఆ వార్తను ఆ దంపతులు తట్టుకోలేకపోయారు. అంత చిన్న వయసులోనే కూతుర్లు పడుతున్న బాధను చూసి తీవ్ర మనస్థాపానికి లోనయ్యారు.

 

ఆ సమయంలో వారు ఆత్మహత్య సరైన మార్గం అని ఆలోచించారు. ఆలోచన వచ్చిన తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ దంపతులు వారి కూతుర్లని తీసుకొని తమిళనాడు,కర్ణాటక సరిహద్దులో ఉన్న పాలారు నది వద్దకు చేరుకున్నారు. ఇక అక్కడ ఎవరూ లేని సమయంలో దంపతులు పిల్లలతో పాటు నీటిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఇక అది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నీటిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న వారిని గజఈతగాళ్ల సహాయంతో బయటకు తీశారు. అప్పటికే వారు నలుగురు మృతి చెందారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న వారు గుండెల విలిసేలా రోదించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -