Modi: దేశానికి ప్రధాని అయినా అమ్మకు కొడుకే.. మోదీ గ్రేట్ కదా?

Modi: మన దేశంలో అన్నింటి కంటే అత్యున్నత పదవి రాష్ట్రపతి అయినప్పటికీ.. సర్వాధికారాలు ఉండేది ప్రధానికేనని చెప్పాలి. అందుకే ప్రధాన మంత్రిని సర్వశక్తిమంతుడిగా చెప్పొచ్చు. ఇటు పార్టీతోపాటు అటు పాలన యంత్రాంగాన్ని, మంత్రులను ఒక్కమాటలో చెప్పాలంటే దేశం మొత్తాన్ని శాసించే అధికారం ఆయనకే ఉంటుంది. ఆయన చిటికేస్తే చాలు కావాల్సినవన్నీ క్షణాల్లో అరేంజ్ కావాల్సిందే. ఆయన ఏం చెబితే అదే శాసనం. అది ప్రధానికి ఉండే ప్రత్యేకత.

 

ఎంత దేశానికి ప్రధానైనా ఒక తల్లికి తానూ కొడుకే కదా. ఈ మాటను అక్షరాలా నిజం చేసి చూపించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన తల్లి హీరాబెన్ ఈరోజు తెల్లవారుజామున 3:30 గంటలకు కన్నుమూశారు. మూడు పదుల వయసున్న తల్లి మరణ వార్త గురించి తెలిసిన వెంటనే మోదీ భావోద్వేగానికి గురయ్యారు. అమ్మను చూస్తే త్రిమూర్తులను చూసినట్లే ఉండేదని ఆయన అన్నారు.

 

అమ్మ ఓ నిస్వార్థ కర్మయోగి: మోదీ
బుద్ధితో, శుద్ధితో పని చేయాలని తన తల్లి చెప్పిన మాటలను ఎప్పటికీ మరువలేనని మోదీ చెప్పుకొచ్చారు. ఆమె తనకు నిజమైన స్ఫూర్తి అని ఆయన ట్వీట్ చేశారు. ఆమె నిస్వార్థ కర్మయోగి, సన్యాసి జీవితాన్ని అనుభవించారంటూ పొగడ్తలతో ముంచెత్తారు మోదీ. విలువలకు కట్టుబడి జీవించిన తన అమ్మకు శాస్త్రోక్తంగా జరగాల్సిన అన్ని కార్యక్రమాలను మోదీ దగ్గరుండి నిర్వహించారు.

 

తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినప్పుడు పరామర్శించిన మోదీ.. ఆమె మరణం తర్వాత తల్లి పార్థీవ దేహం పక్కనే ఉన్నారు. హీరాబెన్ పాడె మోసిన మోదీ.. ఆమె అంతిమయాత్ర వాహనంలో ఎక్కి కూర్చుని దహన సంస్కారాలను దగ్గరుండి నిర్వహించారు. తల్లి చితికి నిప్పు పెడుతూ హీరాబెన్ పెద్ద కొడుకు సోమ్ భాయ్ భావోద్వేగానికి గురయ్యారు. ఏడుస్తున్న ఆయన్ను మోదీ ఓదార్చారు. ఈ ఫొటోలు, వీడియోలు అందర్నీ భావోద్వేగానికి గురి చేస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -