YS Sharmila: కీలక సమయంలో సైలెంట్ గా ఉన్న షర్మిల.. మౌనం వెనుక వేరే వ్యూహాలున్నాయా?

YS Sharmila: ఏపీ పీసీసీ చీఫ్‌గా షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీ రాజకీయాలు మరిన్ని మలుపులు తిరిగాయి. ఓ రకంగా చెప్పాలంటే.. షర్మిల ఏపీలోకి అడుగు పెట్టిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఆమె చుట్టూనే తిరిగాయి. జగన్, చంద్రబాబు, పవన్‌కు కూడా అంత కవరేజ్ లభించలేదు. అంతగా ఆమెకు కవరేజ్ లభించింది. అయితే, ఆమె రాజకీయ ప్రస్తానం చూసిన వాళ్లు ఆమె ఎంతవరకూ సిరియస్‌గా పోరాటం చేస్తుందనే అనుమానం వ్యక్తం చేశారు. వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత అన్న కోసం 2019 వరకూ ఏపీలో పని చేశారు. ఆ తర్వాత సైలంట్ అయ్యి.. 2021లో తెలంగాణ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఆ తర్వాత ఏపీ పాలిటిక్స్ లోకి వచ్చారు. దీంతో.. ఆమెకు రాజకీయంగా ఒక నిర్థిష్టమైన ఆలోచన లేదనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేశారు. అయితే… కొత్తకాలం ఆమె అధికార వైసీపీపై దూకుడుగా వ్యవహరించారు. కానీ, ఇటీవల పరిణామాలు చూస్తుంటే.. అన్న జగన్ తో ఆమెకు అవగాహన కుదిరినట్టు అనుమానం కలుగుతోంది. ఇటీవల మేమంతా సిద్దం అంటూ బస్సు యాత్రను మొదలు పెట్టిన జగన్ ను ఆయన తల్లి విజయమ్మ ఆశీర్వదించింది. యాత్ర విజయవంతం కావాలని ప్రార్థనలు చేసింది. సుమారు నాలుగేళ్లు ఆమె జగన్ తో అంటీ ముట్టనట్టు ఉన్నారు. అలాంటి ఆమె సడెన్ గా జగన్ యాత్రను విజయవంతం కావాలని ప్రార్థనలు చేశారంటే ఎక్కడో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ విజయమ్మను తనవైపు తిప్పుకున్నట్టే.. షర్మిలను కూడా తిప్పుకొని ఉంటాడనే ప్రచారం నడుస్తోంది. ఇటీవల ఆమె విమర్శల డోస్ తగ్గించారు. అంతేకాదు.. మొదట్లో జగన్ పై ఉన్న షర్మిల దృష్టి ఇప్పుడు చంద్రబాబుపై పడింది. ఆమె ఎక్కువగా చంద్రబాబును విమర్శిస్తున్నారు.

షర్మిలతో రాబోయే నష్టాన్ని ముందుగానే ఊహించిన జగన్ ఆమెతో చర్చలు జరిపి ఉంటారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్చలు విఫలం కావడంతోనే షర్మిల సైలంట్ అయ్యారని గుసగులు వినిపిస్తున్నాయి. షర్మిల రాకతోనే వైసీపీ ఓటమి ఖాయమైందనే చర్చ సర్వత్రా జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీలు, ముస్లీం, క్రిస్టియన్ మైనార్టీల సాంప్రదాయంగా కాంగ్రెస్ వైపు ఉంటారు. కానీ, రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితుల మారాయి కాబట్టి.. వీరంతా వైసీపీ వెంట నడుస్తున్నారు. అయితే, షర్మిల రాకతో కాంగ్రెస్ లో ఆశలు చిగురిస్తున్నాయి కాబట్టి మళ్లీ సొంతకూటికి చేరడానికి ఆయా వర్గాల నేతలు రంగం సిద్దం చేసుకుంటున్నారు. షర్మిల పీపీసీ బాధ్యతలు చేపట్టినపుడు.. మణిపూర్ అంశంపై గట్టిగా ప్రశ్నించారు. మణిపూర్‌లో లక్షల మంది క్రైస్తువులు రోడ్డున పడితే.. జగన్ ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. మోడీతో ఎందుకు అంటకాగుతున్నారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యల ప్రభావం ఏపీలో గట్టిగా పడింది. గత ఎన్నికల్లో బ్రదర్ అనిల్ ప్రభావంతో క్రైస్తువులు అంతా గంపగుత్తగా వైసీపీకి ఓట్లు వేశారు. కానీ, షర్మిల కామెంట్స్‌తో క్రైస్తువులు ఆలోచనలో పడ్డారు.

ఇక ముస్లింల విషయానికి వచ్చినట్టు అయితే.. రాజశేఖర్ రెడ్డి ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. దీంతో.. వారంతా కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. కానీ, రాష్ట్రవిభజన తర్వాత వైసీపీ వైపు ర్యాలీ అయ్యారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ బలపడటంతో అటువైపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు వివేకాహత్య కేసు ప్రభావం రాయలసీమలో ఉంది. షర్మిల వివేకాహత్య కేసును ప్రధాన అస్త్రంగా మార్చుకున్నారు. ఇప్పుడు ఆమె సైలంట్ అవ్వకపోతే ప్రమాదం తప్పదని.. ఆమెతో జగన్ చర్చలు జరిపి ఉంటారని అనుమానం వ్యక్తం అవుతుంది. దీనిపై స్పష్టమైన సమాచారం లేకపోయినా.. సడెన్ గా ఆమె సైలంట్ అవ్వడంతో ఇలాంటి అనుమాలు వ్యక్తం అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ బ్యాలెట్ నంబర్ ఖరారు.. ఓటర్లు సులువుగానే ఓటు వేయొచ్చుగా!

Pawan Kalyan:  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పేరు బ్యాలెట్ ఆర్డర్లో ఎక్కడ ఉందో జనసేన పార్టీ ఒక...
- Advertisement -
- Advertisement -