YS Sharmila: రాష్ట్ర ప్రయోజనాలను జగన్ తాకట్టు పెట్టారు.. వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్ వైరల్!

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల విజయవాడలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో జరిగినటువంటి కాంగ్రెస్ నేతల సమావేశానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె ఏపీ ప్రాంతీయ పార్టీలు అయినటువంటి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షర్మిలా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అభ్యర్థుల ఎంపిక విషయంలో ప్రజాస్వామ్యయుతంగా ఉందని తెలిపారు. ప్రాంతీయ పార్టీల తరహాలో ఎంపిక జరిగిందని తెలిపారు.

ఇక వైసిపి తెదేపా ప్రభుత్వం గురించి ఈమె మాట్లాడుతూ ఈ రెండు పార్టీలు మోడీకి బానిసలుగా పనిచేస్తున్నాయని తెలిపారు. గత పది సంవత్సరాల కాలంలో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రత్యేక హోదాని మాత్రం తీసుకు రాలేకపోయారని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని తెలిపారు..

ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి మూకుమ్మడిగా రాజీనామాలు చేసి డ్రామాలు చేశారే తప్ప ఏ ఎంపీ కూడా ప్రత్యేక హోదా కోసం మాట్లాడిన సందర్భాలు లేవని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని, ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి అంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి.

ఒక్కో మహిళకు ఏడాదికి లక్ష రూపాయలు ఇచ్చేలా మహాలక్ష్మి పథకం అందేలా చేస్తామని తెలిపారు. రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీతో పాటు రైతుల పెట్టుబడులపై 50 శాతం మద్దతు ధర ఇచ్చే పథకం అమలు చేస్తామని తెలిపారు. అదేవిధంగా వృద్ధులకు వికలాంగులకు పింఛన్ 4000 రూపాయలను అందిస్తామని షర్మిల ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ బ్యాలెట్ నంబర్ ఖరారు.. ఓటర్లు సులువుగానే ఓటు వేయొచ్చుగా!

Pawan Kalyan:  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పేరు బ్యాలెట్ ఆర్డర్లో ఎక్కడ ఉందో జనసేన పార్టీ ఒక...
- Advertisement -
- Advertisement -