YS Jagan: జగన్ ఆగడాలకు చెక్ పడినట్లేనా.. బీజేపీ నిజస్వరూపం బయటపెట్టబోతుందా?

YS Jagan: ఏపీలో ఇటీవల పరిణామాలు వైసీపీలో ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు అప్రకటిత మిత్రులుగా ఉన్న కేంద్ర బీజేపీతో నేతల చర్యలు చేస్తుంటే.. వైసీపీకి మూడిందనే ప్రచారం జోరుగా సాగుతుంది. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు కుదరడానికి ముందు కేంద్ర పెద్దలు వైసీపీకి అన్ని రకాలుగా అనుకూలంగా ఉండేవారు. పొత్తు కుదిరిన తర్వాత కూడా బీజేపీ.. వైసీపీతో ఎంత వరకూ నిజాయితీగా పోరాటం చేస్తుందనే విషయంలో సర్వత్ర అనుమానం వ్యక్తం అయింది. ఆ అనుమానాలను బలపరిచేలా బీజేపీ అడుగులు ఉండేవి.

చిలకలూరి పేటలో ప్రధాని మోడీ సీఎం జగన్ పేరు ఎత్తకుండానే విమర్శించి వెళ్లిపోయారు. ఏపీలో ఏ మాత్రం ప్రభావం చూపని కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. దాని వలన ఎవరికి ఉపయోగం అనే ప్రశ్నలు కూటమి నేతల్లో వినిపించాయి. ప్రధాని మోడీకి జగన్ పై సాఫ్ట్ కార్నర్ ఉందనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత రఘురామ కృష్ణం రాజు విషయంలో కూడా ఈ అనుమానాలు బలపడ్డాయి. నరసాపురం ఎంపీ అభ్యర్ధిగా బీజేపీ రఘురామకృష్ణం రాజుకు టికెట్ ఇస్తుందని అంతా భావించారు. అయితే సడెన్‌గా లిస్టులో ఆయన పేరు లేదు. దీంతో.. ఆయన రఘురామకృష్ణం రాజు సంచనల వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్‌నే తనకు టికెట్ రాకుండా చేశారని అన్నారు. అంటే.. జగన్ మాటే బీజేపీ పెద్దలు వింటున్నారని పరోక్షంగా చెప్పారు. దీంతో.. కేంద్ర బీజేపీపై టీడీపీ, జనసేన శ్రేణులు ఆగ్రహంగా ఉన్నారు. పొత్తులో బీజేపీ మిత్రధర్మాన్ని పాటించడం లేదని పలువురు బహిరంగంగానే ఆరోపించారు. ఈ విషయాలన్ని రాష్ట్ర బీజేపీ నేతలు అధిష్టానానికి టీడీపీ, జనసేన నేతల అసంతృప్తి చేరవేశారు. తీరు మారకపోతే.. రాష్ట్రంలో బీజేపీ ఖాతా తెరవలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

దీంతో అప్రమత్తమైన కేంద్ర.. వైసీపీ దూకుడుకు అడ్డుకట్ట వేస్తూ వస్తుంది. గడిచిన వారం రోజు పరిణామాలను గమనిస్తే ఈ విషయం క్లియర్ గా అర్థం అవుతుంది. వాలంటీర్ల నుంచి మొదలు పెట్టింది. వాలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచాని ఈసీ ఆదేశించింది. అంతేకాదు.. ఎన్నిలు ముగిసే వరకు వాలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేయించవద్దని తేల్చి చెప్పింది. దీంతో ఏపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. పింఛను ఆపిన పాపం మీదంటే మీది అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈలోగా ఏపీలో ఆరుగురు IPS, ముగ్గురు IASలపై ఈసీ బదిలి వేటు వేయడం మరింత చర్చనీయాంశమైంది. అధికారులు జగన్ కు అనుకూలంగా నడుచుకుంటున్నారని టీడీపీ నేతలు సాక్ష్యాలతో సహా ఈసీకి వివరించడంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. అందువల్లే రాష్ట్రంలో ఒకేసారి 9 మంది అధికారులపై బదిలీవేటు పడింది. అంతేకాదు.. వారిని మళ్లీ ఎన్నికలతో సంబంధం లేని పోస్టుల్లోకి పంపించాలని ఆదేశించింది అంటే అర్థం చేసుకోవచ్చు ఈసీ ఈ అంశాన్ని ఎంత సీరియస్గా తీసుకుందో.

మరోవైపు ఏపీలో ప్రతిపక్ష నేతల భద్రత విషయంలో కూడా కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగానే నారాలోకేష్‌కు కేంద్రం భద్రత పెంచింది. ప్రస్తుతం పెరిగిన భద్రతా సిబ్బంది ఆయన రక్షణగా ఉన్నారు. ఇప్పటికే విధుల్లో చేరారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయనకు జెడ్ కేటగిరి భద్రత కల్పించింది. సీఆర్పీఎఫ్ బలగాలు ఆయనకు సెక్యూరిటీగా ఉండనున్నారు. వైసీపీ ప్రేరేపిత దాడులు లోకేష్ పై జరిగే అవకాశం ఉందని రాష్ట్ర ఇంటెలిజెన్సీ కేంద్రానికి రిపోర్టులు ఇచ్చింది. దీంతో.. అప్రమత్తమైన కేంద్రం ఆయన భద్రతను పెంచింది. ఇప్పటికే సెక్యూరిటీ సిబ్బంది విధుల్లో చేరారు. దీంతో.. టీడీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల జరిగిన పరిణామాలు టీడీపీ శ్రేణులను ఒకింత ఆందోళన కలిగించారు. ఎక్కడిక్కడ నారాలోకేష్ వాహనాలను చెక్ చేశారు. ఎన్నికల నేపథ్యంలో చెక్ చేయడంలో తప్పులేదు. ఒకే రోజు గంట వ్యవధిలోనే రెండు, మూడు చోట్ల తనిఖీలు జరగడం అనుమానాలకు తావిచ్చింది. దీంతో.. టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. నారాలోకేష్ కూడా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల వాహనాలు ఎందుకు తనిఖీలు చేయడం లేదని మండిపడ్డారు. ఈ పరిస్థితులు లోకేష్ కు సెక్యూరిటీ పెంచడానికి కారణమని చెప్పొచ్చు.

వరుస ఘటనలను చూస్తుంటే.. ఇక బీజేపీ.. వైసీపీకి ఏ కోశానా సాయం చేసే పరిస్థితి లేదని అర్థం అవుతుంది. ప్రలోభాలతోనో.. బెదిరింపులతోనో మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న జగన్ ఆటలు సాగేలా కనిపించడం లేదు.

Related Articles

ట్రేండింగ్

TDP-Janasena-BJP Manifesto: కూటమి మేనిఫెస్టో చూసి జగన్ ఓటమి ఫిక్స్ అయ్యారా.. ఏం చేసినా పార్టీ గెలిచే ఛాన్స్ లేదా?

TDP-Janasena-BJP Manifesto: మరొక రెండు వారాలలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున హడావిడి నెలకొంది. ప్రచార కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు మరోవైపు ఎన్నికల మేనిఫెస్టోని కూడా ఇరువురు పార్టీలు విడుదల...
- Advertisement -
- Advertisement -