Narsapuram MP Candidate: ర‌ఘురామ‌కు న‌ర‌సాపురం టికెట్టే.. చంద్రబాబు పట్టుబట్టడంతో పొలిటికల్ లెక్కలు మారతాయా?

Narsapuram MP Candidate: వైసీపీ రెబెల్ ఎంపీగా పేరు సంపాదించుకున్నటువంటి రఘురామకృష్ణం రాజుకు ప్రస్తుతం ఏ పార్టీ నుంచి కూడా టికెట్ లేకపోవడంతో ఈయన పరిస్థితి కాస్త అయోమయంలో ఉంది కానీ ఈయన మాత్రం ఎన్నికలలో నేను తప్పనిసరిగా పోటీ చేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నర్సాపురం ఎంపీగా కొనసాగుతున్నటువంటి రఘురామకృష్ణం రాజుకు తిరిగి నరసాపురం ఎంపీ టికెట్ ఇవ్వాలని ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం నర్సాపురం పార్లమెంట్ స్థానంలో కూటమిలో భాగంగా బిజెపి నేత శ్రీనివాస్ వర్మ పోటీ చేస్తున్నారు అయితే ఆయనని అక్కడి నుంచి తప్పించి రఘురామకృష్ణం రాజుకు ఆ టికెట్ ఇవ్వాలని ఆశిస్తున్నారు. ఇదే విషయం గురించి కూటమి నేతలతో చంద్రబాబు నాయుడు చర్చించారని తెలుస్తోంది. ఇక శ్రీనివాస వర్మకు ఉండి అసెంబ్లీ అభ్యర్థిగా టికెట్ ఇవ్వాలని ఈయన తెలిపారు.

నరసాపురం ఎంపీ అభ్యర్థిగా రఘురామకృష్ణం రాజు టికెట్ ఇస్తే తప్పకుండా ఆయన గెలుస్తారని ఇలా గెలిచే నియోజకవర్గం వదులుకోవడానికి బాబు ఇష్టం చూపలేదని తెలుస్తుంది. ఇక ఈ విషయంపై బీజేపీ అగ్ర నేతలతో చర్చించి చెబుతామని తెలిపారు. ఇలా రఘురామకృష్ణం రాజుకు పట్టుబట్టి మరి చంద్రబాబు నాయుడు నరసాపురం టికెట్ ఇప్పించడానికి కారణం లేకపోలేదని తెలుస్తుంది. నరసాపురం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

ఈయనకు అక్కడ టికెట్ ఇస్తే ఆ ఏడు స్థానాలలో కూడా టీడీపీకి మంచిపట్టు ఉంటుందన్న ఉద్దేశంతోనే రఘురామకృష్ణం రాజు విషయంలో చంద్రబాబు ఇలా పట్టు పట్టారని తెలుస్తుంది. ఇక రఘురామకృష్ణం రాజు బీజేపీకి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో సహాయం చేశారు ప్రధానమంత్రి మోడీని సాక్షాత్తు దేవుడితో కొలిచి ఎన్నోసార్లు ప్రశంసల కురిపించారు ఇలా ప్రత్యక్షంగా పరోక్షంగా బిజెపికి కూడా అనుచరుడుగా ఉన్నటువంటి ఈయన విషయంలో మాత్రం చంద్రబాబు కాస్త చొరవ తీసుకుంటున్నారనే చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -