Modi – Jagan: మోదీ, జగన్ మధ్య ఏం జరుగుతోంది.. మోదీ, జగన్ ప్లాన్ చేసి అన్నీ చేస్తున్నారా?

Modi – Jagan: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున రాజకీయ వేడి రాజుకుంది నువ్వా నేనా అంటూ పెద్ద ఎత్తున అన్ని పార్టీ అధినేతలు అభ్యర్థులు ప్రచార కార్యక్రమాలలో మునిగి తేలుతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా ఎన్నికల బరిలో దిగుతూ ఉండగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన బిజెపితో పొత్తు పెట్టుకుని మరి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇక ఈ ప్రచార కార్యక్రమాలను చిలకలూరిపేట నుంచి నరేంద్ర మోడీ ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే.

ఈ సభలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు అయితే ఈయన స్పీచ్ పై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది ఈయన జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఏదైనా మాట్లాడతారా ఆయన చేస్తున్నటువంటి అవినీతిపైన అలాగే ఆయనపై అక్రమాస్తులు ఉన్న విషయం గురించి ప్రధానమంత్రి మాట్లాడతారని అలాగే తన బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి కూడా మాట్లాడతారని ప్రతి ఒక్కరూ భావించారు.

ఇక ఈ సభలో మోడీ మాత్రం జగన్ పేరు కూడా ప్రస్తావించకుండా కేవలం జగన్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు అవినీతి చేయడానికి పోటీ పడుతున్నారని తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీ వైసీపీ పార్టీ రెండు ఒకటేనని ఆరోపణలు చేశారు అంతకుమించి జగన్మోహన్ రెడ్డిని పళ్ళు ఎత్తి మాట కూడా అనలేదు. ఇలా జగన్ మోహన్ రెడ్డి గురించి నరేంద్ర మోడీ ప్రస్తావించకపోవడంతో కూటమినేటలు కాస్త నిరాశ వ్యక్తం చేశారు.

ఇక జగన్మోహన్ రెడ్డి సైతం మేమంతా సిద్ధమే అంటూ బస్సు యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోని ఈయన నంద్యాల ప్రొద్దుటూరు వంటి ప్రాంతాలలో భారీ బహిరంగ సభలను నిర్వహించారు ఈ సభలలో కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం జనసేన గురించి మాట్లాడేరే తప్ప ఎక్కడా కూడా మోడీ గురించి మాట్లాడిన దాఖలాలు లేవు.

జగన్ కేంద్రాన్ని ప్రశ్నించాలంటే చాలా ఉన్నాయి పోలవరానికి నిధులు ఇవ్వలేదు ప్రత్యేక హోదా ఇవ్వలేదు అలాగే రాష్ట్ర నిర్మాణానికి నిధులు ఇవ్వలేదు ఇలా వీటన్నింటి గురించి జగన్మోహన్ రెడ్డి ఈ సభ వేదికగా మోడీని ప్రశ్నించాల్సి ఉంటుంది కానీ మోడీ గురించి ఒక్క మాట కూడా జగన్ ప్రస్తావించకపోవడంతో వీటిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఏంటి? అసలు వీరిద్దరూ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా ప్లాన్ ప్రకారం ఇలా ముందుకు వెళ్తున్నారా అన్న సందేహాలు ప్రతి ఒక్కరిలోనూ కలుగుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chiranjeevi: చిరంజీవిపై విషం చిమ్మడం పాత్రికేయమా.. ఇది వ్యభిచారం కాదు వెబ్ చారమ్ అంటూ?

Chiranjeevi: ప్రస్తుత కాలంలో ఒక్కొక్క మీడియా సంస్థ ఒక్కొక్క రాజకీయ పార్టీకి కొమ్ముకాస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి కొన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేకించి చానల్స్ పెట్టుకోవడం కూడా గమనార్హం. అయితే ఒక...
- Advertisement -
- Advertisement -