Health Tips: భోజనం మధ్యలో నీరు తాగడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

Health Tips: చాలామంది భోజనం చేసేటప్పుడు మధ్య మధ్యలో నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉంటారు. మరి కొంతమంది భోజనం ముగించే వరకు నీటిని తాగరు. భోజనం సమయంలో నీరు తాగకూడదు అని వైద్యులు చెబుతూ ఉంటారు. భోజనం చేసేటప్పుడు నీరు తాగడం వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకు గల కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. భోజనం తినే సమయంలో లేదంటే తిన్న వెంటనే నీటిని తాగడం వల్ల వాటి ప్రభావం జీర్ణక్రియ పై పడుతుంది.

 

ఆహారం తిన్న వెంటనే కడుపులో జీర్ణ ప్రక్రియ మొదలవుతుంది. అటువంటి సమయంలో నీరు తాగడం వల్ల జీర్ణ క్రియ కు ఆటంకం ఏర్పడుతుంది. కొన్ని కొన్ని సార్లు తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వదు. భోజనం చేసే సమయంలో నీరు తాగితే శరీరంలో ఇన్సులిన్ పరిమాణం పెరిగే ప్రమాదముంది. ఇన్సులిన్ స్థాయి పెరిగితే డయాబెటిస్ ముప్పు పెరుగుతుంది. కాబట్టి భోజనం సమయంలో నీటిని తీసుకోవడం మానేయాలి. తిన్న వెంటనే కూడా తాగకూడదు. ఒక వేరే నీళ్లు తాగాలి అనుకుంటే ఎమర్జెన్సీ అయితే తాగవచ్చు లేదంటే అరగంట గ్యాప్ ఇవ్వడం మంచిది. ఆహారంతో పాటు నీరు తాగడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ సమస్య కూడా రావచ్చు. ఆహారం తీసుకునేటప్పుడు నీరు తాగితే కడుపులో యాసిడ్ పరిమాణం పెరుగుతుంది.

 

ఈ క్రమంలోనే పుల్లని తేన్పులు కూడా వస్తాయి. ఈ సమస్యను యాసిడ్ రిఫ్లక్స్ అంటారు. భోజన సమయంలో నీరు తాగడం వల్ల ఛాతీలో కూడా మంట వస్తుంది. అలాగే భోజనం సమయంలో నీరు తాగడం వల్ల ఊబకాయం బారిన పడే సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. భోజనం సమయంలో నీరు తాగడం వల్ల జీర్ణక్రియ పై ప్రభావం పడి తిన్న ఆహరం సరిగా జీర్ణం అవ్వదు. జీర్ణం కాని ఆహారం నుంచి గ్లూకోజ్ తయారయ్యి స్థూలకాయం సమస్యకు దారితీస్తుంది. తినేటప్పుడు నీరు తాగితే శరీరంలో చక్కెర స్థాయితో పాటు మీ బరువు కూడా పెరుగుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -