Relationship: వైవాహిక బంధం బాగుండాలంటే అలా చేయాల్సిందే?

Relationship: పెళ్లయిన భార్య భర్తలు ప్రతి ఒక్కరు కూడా వైవాహిక జీవితం బాగుండాలని ఎటువంటి గొడవలు మనస్పర్ధలు రాకుండా అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అయితే వైవాహిక జీవితం కలకాలం నిలుపుకోవాలి అంటే భార్య భర్తలు ఇద్దరు తప్పకుండా కృషి చేయాల్సిందే. ఇందుకోసం భార్యాభర్తలు తప్పకుండా వారి వైవాహిక జీవితం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మరి వైవాహిక జీవితం కలకాలం నిలవాలంటే భార్యాభర్తలు ఎటువంటి విషయాలు తెలుసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలామంది వైవాహిక జీవితంలో ఎవరో చెప్పినవి విని వైవాహిక జీవితం మీద అంచనాలు పెట్టుకుంటూ ఉంటారు.

 

కానీ ఎప్పటికీ చేయకూడదు. వైవాహక జీవితం అంటే జంటగా కలిసి చేసే ప్రయాణం కాబట్టి ఆ ఇద్దరు కలిసి నడుస్తున్న ప్రయాణంలో నిజానిజాలను తెలుసుకొని ముందుకు వెళ్లడం మంచిది. అలాగే భార్యాభర్తల మధ్య బ్యాలెన్స్ అన్నది చాలా ముఖ్యం. భార్యాభర్తల్లో ఒకరు డామినేట్ చేయడం అన్నది ఉండకూడదు. ఒకరి మాటను ఇంకొకరు గౌరవించి వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగాలి. విలువలను పాటిస్తూ ఇద్దరిలో ఎవరూ గొప్పకాదు ఇద్దరూ సమానమే అన్న భావన కలగాలి. భాగస్వామి ఆలోచనలు,నిర్ణయాలకు, అభిప్రాయాలకు విలువనివ్వాలి.

 

భార్యాభర్తల మధ్య విమర్శలు అన్నది పెద్ద చెడ్డ అలవాటు. ఈ అలవాటు ఉంటే వీలైంనంత తొందరగా మానుకోవాలి లేదంటే తగ్గించుకోవాలి. అలాగే భాగస్వామి మీకోసం చేసే చిన్న చిన్న పనులను మెచ్చుకుంటూ వారిని అభినందించాలి. అలా చేయడం వల్ల వారి కష్టాన్ని తగ్గ ఫలితం లభించిందని వారు ఎంతో సంతోషపడతారు. అలాగే భార్యాభర్తల మధ్య సర్దుబాటు అన్నది చాలా ముఖ్యం. గొడవలు వచ్చినప్పుడు ఇద్దరిలో ఒకరు లేదంటే ఇద్దరు సర్దుకుపోయే గుణాలు ఉండాలి. అప్పుడే వారి మధ్య బంధం మరింత బలపడి వైవాహిక జీవితం కలకాలం నిలుస్తుంది

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -