Balayya: ఆమె ఎంట్రీ ఇచ్చాకే బాలయ్యకు అదృష్టం కలిసొచ్చిందా?

Balayya: ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి నందమూరి బాలకృష్ణ అడుగుపెట్టాడు. మాస్ హీరోగా, క్లాస్ హీరోగా తనదైన శైలిలో ప్రతి క్యారెక్టర్ లోనూ ఆయన బరకాయ ప్రవేశం చేస్తారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన నటించి ప్రభంజనం సృష్టించారు. బాలయ్య హిట్ కొట్టాడంటే ఇండస్ట్రీ రికార్డ్స్ మారిపోవాల్సిందే. అయితే బాలయ్య కెరీర్ లో డిజాస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి.

 

బాక్స్ ఆఫీస్ వద్ద నాసిరకపు డైరెక్టర్లతో, నాసిరకం సినిమాలు చేసి బాలయ్య తన ఖాతాలో కొన్ని డిజాస్టర్ సినిమాలను వేసుకున్నారు. వాటి వల్ల తన ఇమేజి మొత్తాన్ని ఒక దశలో పోగొట్టుకున్నాడని చెప్పాలి. ఆ సమయంలో తన ఫ్యాన్స్ కూడా ఏంటి ఈయన ఇలా అయిపోయాడని బాధపడ్డారు కూడా. కొంత మంది అయితే ఆయన సినిమాలను థియేటర్స్ లో చూడడం పూర్తిగా మానుకున్నారు. అఖండ సినిమాకి ముందు బాలయ్య కెరీర్ లో అన్నీ డిజాస్టర్ ఫ్లాప్స్ రాగా అవన్నీ మాయని మచ్చగా మిగిలిపోయాయి.

 

అఖండ సినిమాకు ముందు ఆయన చేసిన రూలర్ సినిమా పది కోట్ల రూపాయిల షేర్ ని కూడా వసూలు చేయలేక కుదేలైంది. ఆ సినిమా తర్వాత బాలయ్య కెరీర్ ముగిసినట్టే అని అందరూ ఫిక్స్ అయిపోయిన తరుణంలో సరిగ్గా అలాంటి సమయంలోనే అఖండ సినిమా విడుదలై కొత్త ఆశలు రేకెత్తించింది. ఇక ఆ తర్వాత ఆహా ఓటీటీలో ప్రసారమయ్యే ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షోతో బాలయ్య కెరీర్ మరో మలుపు తిరిగిందని చెప్పొచ్చు.

 

గోపీచంద్ మలినేనితో చేసిన ‘వీర సింహా రెడ్డి’ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఆ సినిమా తర్వాత వెంటనే ఆయన అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత కొరటాలతో మరో సినిమా ఉంది. ఇలా క్రేజీ కాంబినేషన్స్ లో సినిమాలు సెట్ అవ్వడానికి బాలయ్య చిన్న కూతురు తేజస్వినే కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ‘అన్ స్టాపబుల్’ షోకి కూడా క్రియేటివ్ హెడ్ గా పనిచేస్తున్నారు.B

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -