Health Tips: నల్ల ఎండుద్రాక్ష తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే?

Health Tips: ద్రాక్ష పళ్ళు.. వీటిలో మనకు రెండు రకాల ద్రాక్ష పళ్ళు మార్కెట్లో లభిస్తూ ఉంటాయి. అందులో ఒకటి నల్ల రంగు ద్రాక్ష, రెండవది ఆకుపచ్చని ద్రాక్ష. ఇది చాలా వరకు ఎక్కువ మంది నల్ల ద్రాక్షనే ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటారు. ఆకుపచ్చని ద్రాక్ష కొన్ని తీపిగా ఉంటే మరికొన్ని పుల్లగా ఉంటాయి. అందుకే చాలామంది నల్ల ద్రాక్ష ధర ఎక్కువైనా ఎక్కువగా దాన్నే కష్టపడి తింటూ ఉంటారు. నల్ల ద్రాక్ష వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. కేవలం నల్ల ద్రాక్షలో మాత్రమే కాకుండా నల్ల ఎండు ద్రాక్షలో కూడా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నల్ల ఎండు ద్రాక్షలో విటమిన్ సి లభిస్తుంది. ఇది మన శరీరం ఇనుమును గ్రహించడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

 

అంతేకాకుండా నల్ల ఎండు ద్రాక్ష రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఇందులో విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. హానికర విష వ్యర్థం నుంచి మన కళ్ళను కాపాడుతుంది. అయితే నల్ల ఎండుద్రాక్షను మార్కెట్లో లేదంటే ఈ కామర్స్ సైట్లో కూడా డ్రైఫ్రూట్ రూపంలో పొందవచ్చు. చాలా తక్కువ మంది మాత్రమే ఈ నల్ల ఎండుద్రాక్షను తింటూ ఉంటారు. నల్ల ద్రాక్ష పండులో కాల్షియం పుష్కలంగా లభించడంతోపాటు అది మన దంతాలు ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. అంతేకాకుండా జలుబు దగ్గు వంటి ఫ్లూ ఇన్ఫెక్షన్స్ వంటి బారిన పడకుండా కాపాడుతుంది.

 

అలాగే వాటిలో అధిక మొత్తంలో ఫ్లేవనాయిడ్స్, ఒమేగా 3 యాసిడ్‌లు ఉంటాయి. ఇవి హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చలికాలంలో దీన్ని తీసుకోవడం చాలా మంచిది. అలాగే మూత్రనాళంలో బ్యాక్టీరియా పెరుగుదల ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది. బ్లాక్‌ కరెంట్‌లో ఆంథోసైనిన్‌లు, టానిన్‌లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి బ్యాక్టీరియాను అడ్డుకోవడం, దాని పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి. నల్ల ఎండు ద్రాక్ష మన జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఇందులో అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి మన మెదడును విష వ్యర్థాల ద్వారా దెబ్బతినకుండా కాపాడతాయి. నల్ల ఎండుద్రాక్షలోని ఐరన్ మెదడుకు ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది. ద్రాక్ష కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -