Balayya-Krithi Shetty: బాలయ్య కు హీరోయిన్ కృతిశెట్టి.. ట్విస్ట్ ఇదే!

Balayya-Krithi Shetty: తెలుగు తెర మీద డైలాగులు చెప్పాలంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు నందమూరి బాలయ్య. నందమూరి నట వారసుడిగా తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టిన నందమూరి బాలయ్య.. తక్కువ కాలంలోనే తన ట్యాలెంట్ ను నిరూపించుకున్నాడు. మాస్ జనాలకు దగ్గరైన బాలయ్య.. నందమూరి కీర్తి పతాకాన్ని మరింత విస్తరించాడు. నందమూరి బాలయ్య సినీ ప్రస్థానం సెకండ్ ఇన్నింగ్స్ లో మరింత జోరుగా సాగుతోంది.

 

బోయపాటి శీనుతో కలిసి ‘లెజెండ్’ చేసి తెలుగు తెర మీద తన స్థానాన్ని తిరిగి నిలబెట్టుకున్న బాలయ్య.. ‘అఖండ’తో తనకు ఎదురులేదని నిరూపించాడు. కరోనా టైం తర్వాత థియేటర్లకు జనాలు రావడానికి జంకుతున్న సమయంలో ‘అఖండ’తో జనాలు థియేటర్ల బాట పట్టేలా చేశాడు. ఈ సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’గా అందరినీ ఆకట్టుకోవడానికి సిద్ధమైపోయాడు.

 

గోపిచంద్ మలినేని, బాలయ్య కాంబోలో వస్తున్న ‘వీరసింహారెడ్డి’ ట్రైలర్ ఆకట్టుకోగా.. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. కాగా ఈ సినిమా తర్వాత బాలయ్య డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఇంతలోనే బాలయ్య చేయబోయే కొత్త సినిమాకు సంబంధించిన ఓ విషయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ సినిమాలో హీరోయిన్ టాలీవుడ్ యంగ్, యూత్ క్రష్ అవడం విశేషం.

 

కళ్యాణ్ రామ్ తో కలిసి ‘బింబిసార’ చేసిన డైరెక్టర్ మల్లిడి వశిష్ట బాలయ్యతో కలిసి ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో బాలయ్య పక్కన హీరోయిన్ గా టాలీవుడ్ బేబమ్మ కృతి శెట్టి నటించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో కృతి శెట్టి కేవలం రెండు సీన్లలో మాత్రమే కనిపిస్తుందని సమాచారం. యంగ్ హీరోల పక్కన ఛాన్సులు కొట్టేస్తున్న కృతి శెట్టి బాలయ్యతో సినిమా చేయబోతోందనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీని ఊపేస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -