OTT Platforms: ఉచితంగా నెట్ ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ పొందాలని భావిస్తున్నారా.. అయితే ఇలా చేయండి?

OTT Platforms: ప్రస్తుతం టెలికాం కంపెనీలు పలు రీచార్జ్ ప్లాన్ లపై ఉచితంగా ఓటీటీ సబ్‌స్క్రిప్ష్ ను అందిస్తున్నాయి. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ వంటివి ఈ వెసులుబాటును కల్పిస్తున్నాయి. అయితే ఉచితంగా నెట్ఫిక్స్ అమెజాన్ ప్రైమ్ పొందాలని భావిస్తున్నారా!అయితే ఇది తెలుసుకోవాల్సిందే.. ప్రస్తుతం జియో అందిస్తున్న 399 ప్లాన్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్. ఇందులో కూడా మీరు ఉచితంగా అమెజాన్ ప్రైమ్ పొందవచ్చు. ఇంకా నెట్‌ఫ్లిక్స్ కూడా వస్తుంది. ఇవే కాకుండా అపరిమిత కాల్స్ కూడా చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్ పంపొచ్చు.

 

అలాగే నెలకు 75 జీబీ డేటా వస్తుంది. 75 జీబీ డేటా అయిపోతే తర్వాత ఒక్కో జీబీ డేటాకు రూ.10 చొప్పున చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ 399 పోస్ట్ పెయిడ్ ప్లాన్‌తో అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఏడాది పాటు వస్తుంది. అలాగే నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ సబ్‌స్క్రిప్షన్ వస్తుంది. అలాగే జియో టీవీ, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ అనే యాప్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఫ్రీగా పొందొచ్చు. అయితే మీరు జియో ప్రైమ్ కోసం అదనంగా మరో రూ. 99 చెలించాల్సి ఉంటుంది. అలాగే మీకు ఈ పోస్ట్ పెయిడ్ ప్లాన్‌పై 200 జీబీ డేటా వరకు రోలోవర్ బెనిఫిట్ కూడా ఉంటుంది. ఇంకా ఇప్పుడు రిలయన్స్ జియో అర్హత కలిగిన కస్టమర్లకు అపరిమితి 5జీ డేటా కూడా ఆఫర్ చేస్తోంది.

 

బేస్ ప్లాన్ ఉంటే చాలు ఈ సదుపాయం కల్పిస్తోంది. 5జీ సర్వీసులు ఆవిష్కరణలో భాగంగా ఈ వెసులుబాటును అందుబాటులో ఉంచింది. అందువల్ల మీరు జియో కస్టమర్లు అయితే ఈ బెనిఫిట్ పొందొచ్చు. అయితే మీ ఫోన్ 5జీ అయ్యి ఉండాలి. మీ ఏరియాలో జియో ట్రూ5జీ కవరేజ్ వస్తుండాలి. ఇకపోతే మీరు ప్రిపెయిడ్ జియో సిమ్ వాడుతూ ఉంటే దాన్ని సులభంగానే పోస్ట్ పెయిడ్‌లోకి మార్చుకోవచ్చు. తర్వాత నెలకు రూ. 399 పోస్ట్ పెయిడ్ ప్లాన్ ఎంచుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటుగా అపరిమిత కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ వంటి బెనిఫిట్స్ పొందొచ్చు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -