Kumari Aunty: కుమారి ఆంటీ దశ మారిపోయిందా.. రేవంత్ వల్ల దశ తిరిగిందా?

Kumari Aunty: ఆమె తన ఫుడ్‌ కోర్ట్‌ కు వచ్చే వారితో చక్కగా మర్యాదగా మాట్లాడుతూ వారికి కావాల్సిన ఆహార పదార్థాలు అందిస్తూ ఉండటం వల్ల చాలా మంది ఆమెను అభిమానిస్తూ ఉండేవారు. అలా ఆమె చాలా మంది అభిమానం సొంతం చేసుకుంది. మెల్ల మెల్లగా ఆమె యూట్యూబ్‌ ద్వారా ఫేమస్ అయ్యి మరింతగా ఆమె వద్దకు జనాలు వచ్చేలా పరిస్థితి మారింది. ఆ మధ్య రోడ్డు పై ట్రాఫిక్ జామ్‌ అవుతుందని, ఆమె ఫుడ్ కోర్ట్‌ ను పోలీసులు మూసి వేయించడం.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆమె ఫుడ్‌ కోర్ట్‌ ను మళ్లీ తెరిపించడం మాత్రమే కాకుండా త్వరలో కుమారి ఆంటి ఫుడ్‌ కోర్ట్‌ వద్దకు వెళ్తాను అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇదంతా కూడా నాటకీయంగా అనిపిస్తున్న జరిగిన సత్యం.

అయితే ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ తో ప్రముఖ ఓటీటీ నెట్‌ ఫ్లిక్స్ లో ఒక డాక్యుమెంటరీని తీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో కుమారి ఆంటీనే కనిపించబోతున్నారట.

ఈ మధ్య నెట్‌ ఫ్లిక్స్ లో కర్రీ అండ్‌ సైనైడ్ అనే డాక్యుమెంటరీ బాగా హిట్ అయ్యింది. అందుకే నెట్‌ ఫ్లిక్స్ మరిన్ని డాక్యుమెంటరీలను తీసుకు వచ్చేందుకు రెడీ అవుతోందట. అందులో భాగంగానే నెట్‌ ఫ్లిక్స్ వారు కుమారి ఆంటీ పై ఒక డాక్యుమెంటరీని కాస్త సినిమాటిక్ గా తీస్తే బాగుంటుంది అనే నిర్ణయానికి వచ్చారు అంటూ సమాచారం అందుతోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -