Balayya: ఆ సినిమా తర్వాత బాలయ్య సినిమాల్లో నటించరా?

Balayya: నందమూరి బాలకృష్ణ సంక్రాంతికి వీరసింహా రెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇటీవలె ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా బాలయ్య తన తదుపరి సినిమాల గురించి కూడా తెలియజేశాడు. రాబోయే రెండు మూడు సినిమాలకు ఒకే వేదిక నుంచి ఆయన క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. వీరసింహారెడ్డి సినిమా ఈవెంట్ వేదికపై బాలయ్య మాట్లాడుతూ తన మనసులోని మాటను బయటపెట్టాడు. చెంఘీజ్‌ ఖాన్ సినిమా చేయడం తన జీవిత ఆశయమని తెలిపాడు.

 

 

చెంఘీజ్ ఖాన్ సినిమా చేయడానికి సరైన టైమ్ రావాలని బాలయ్య అన్నారు. ప్రస్తుతం బాలయ్య చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. బాలయ్య చెంఘిజ్‌ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పటంతో ఇప్పుడంతా గూగుల్ లో ఆయన ఎవరోనని తెలుసుకునేందుకు సెర్చ్ చేస్తున్నారు.

 

చెంఘీజ్‌ ఖాన్ ను కొందరు హీరో అంటే ఇంకొందరు క్రూరుడు అని అంటారు. ఆయన పేరు చెబితే రక్తంతో తడిచిన పేజీలో చరిత్రలో దర్శనమిస్తాయని మరికొందరు చెబుతారు. భూమిని పాలించిన గొప్ప చక్రవర్తుల్లో చెంఘిజ్ ఖాన్ కూడా ఉన్నాడు. చెంఘీజ్‌ ఖాన్‌ ఆసియా నుంచి బయల్దేరి ప్రపంచ దేశాలను ఆక్రమించినట్లు చరిత్రపుటల్లో మనకు కనపడుతుంది.

 

తాజాగా బాలయ్య వీరసింహారెడ్డి సినిమా ఈవెంట్లో చెంఘిజ్ ఖాన్ గురించి చెప్పటంతో సోషల్ మీడియాలో మరో వార్త వైరల్ అవుతోంది. బాలయ్య చెంఘీజ్ ఖాన్ జీవిత చరిత్రలో నటించిన తర్వాత సినిమాలకు దూరం కానున్నట్లు సమాచారం. చెంఘిజ్ ఖాన్ సినిమానే బాలయ్య చివరి సినిమా అని సమాచారం. ఈ మూవీ తర్వాత బాలయ్య సినిమాల్లో నటించరని తెలుస్తోంది. మొత్తానికి ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొంత కాలం వేేచి ఉండాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -