Balayya: బాలయ్యను అర్థం చేసుకోవడంలో దర్శకులు తడబడుతున్నారా?

Balayya: టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ శైలిని, స్టైల్ ను అర్థం చేసుకుని ఈ మధ్య కాలంలో హిట్లు ఇచ్చిన దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది బోయపాటి శ్రీనునే అని మనకు తెలుసు. బోయపాటి శ్రీను సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించినా ఏ పాత్ర ప్రాధాన్యత ఆ పాత్రకు ఉంటుందని ఆయన సినిమాలు చూస్తేనే తెలుస్తుంది. గోపీచంద్ మలినేని బాలయ్యను డ్యూయల్ రోల్ లో చూపించినా రెండు పాత్రలకు న్యాయం చేయడంలో తడబడ్డారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

 

వీరసింహారెడ్డి సినిమాపై ఎన్ని అంచనాలైనా పెట్టుకోవచ్చని చెప్పిన గోపీచంద్ మలినేని ఫస్టాఫ్ తో మెప్పించి సక్సెస్ అయ్యారు. అయితే ఆ తర్వాత సెకండాఫ్ తో మాత్రం కాస్త నిరాశ పరిచారనే టాక్ వినిపిస్తోంది. లెక్కకు మించిన ఫైట్లు, పాటలు, కనెక్ట్ అయ్యే ఎమోషనల్ సీన్లు లేకపోవడం వంటివి సినిమాకు కాస్త మైనస్ అయ్యిందని అనిపిస్తోంది. దీంతో బాలయ్య బోయపాటి కాంబినేషన్ మాత్రమే హిట్ కాంబినేషన్ అని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. అనిల్ రావిపూడి సినిమా తర్వాత బాలయ్య బోయపాటి శ్రీను కాంబోలో సినిమా రావాలని ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఆశిస్తున్నారు.

 

సింహా, లెజెండ్, అఖండ విజయాలతో బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఇంకొన్ని సినిమాలు కూడా రావాలని అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వీరసింహారెడ్డి అంచనాలను అందుకోకపోవడంతో బాలయ్య అభిమానుల ఆశలన్నీ ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమాపైనే ఉన్నాయని తెలుస్తోంది. సాధారణంగా అనిల్ రావిపూడి సినిమాలు అంటే మినిమం గ్యారంటీ అనే భావన ఇండస్ట్రీ వర్గాల్లో ఉండటంతో ఆ సినిమా హిట్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు.

 

బోయపాటి శ్రీను తరహాలో ఇతర దర్శకులు బాలయ్యను హ్యాండిల్ చేయలేకపోతున్నారని, ట్రైలర్ల వరకు మెప్పించినా సినిమాలు మాత్రం ప్రేక్షకులను మెప్పించడం లేదని నెట్టింట కామెంట్లు వినిపిస్తున్నాయి. వరుసగా విజయాలను సాధించడంలో బాలయ్య ఫెయిల్ అవుతున్నారని టాక్ నడుస్తోంది. బాలయ్య సైతం ప్రాజెక్టుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేయాలని మరికొందరు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -