Vaarasudu-Veera Simha Reddy: వారసుడు వల్ల వీరసింహారెడ్డికి ఇంత నష్టమా?

Vaarasudu-Veera Simha Reddy: సంక్రాంతికి సినిమాల పండగ కొనసాగుతోంది. ఈ తరుణంలో నేడు వారుసుడు సినిమా థియేటర్లలో విడుదలైంది. టాలీవుడ్ టాప్ నిర్మాత అయిన దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్లలో వారసుడు సినిమా విడుదలైంది. అయితే కొందరికి మాత్రం ఓ సందేహం మొదలైంది. ఇప్పటికే థియేటర్లలో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు ఉన్నాయి. బాలకృష్ణ, చిరంజీవి నటించిన రెండు పెద్ద సినిమాలు చాలా థియేటర్లలో ఉన్నప్పుడు మరి వారసుడు సినిమాకు భారీగా స్క్రీన్స్ ఎలా దొరికాయంటూ అందరూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దిల్ రాజ్ ఇక్కడే తన మేజిక్ ను చూపించడం విశేషం.

 

హైదరాబాద్ సెంటర్ విషయానికే వస్తే ఈరోజు హైదరాబాద్ లో వాల్తేరు వీరయ్యకు 369 షోలు ఉండగా వారసుడు సినిమాకు కూడా ఏమాత్రం తగ్గని విధంగా 328 షోలు ఉండటం విశేషం. వీటివల్ల వీరసింహారెడ్డికి షోలు తగ్గాయనే చెప్పొచ్చు. హైదరాబాద్ సిటీలో నేడు బాలకృష్ణ సినిమాకు కేవలం 262 షోలు మాత్రం దక్కాయని సమాచారం.

 

ఇలాంటి పద్ధతి ఒక్క హైదరాబాద్ సిటీకి మాత్రమే పరిమితం కాలేదు. ఉత్తరాంధ్రలో కూడా ఇదే సీన్ నడుస్తోంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో ఈరోజు నుంచి వీరసింహారెడ్డికి షోలు తగ్గిపోయాయని తెలుస్తోంది. ఆ స్థానాల్లో వారసుడు షోలు వేస్తున్నారు. మరోవైపు వారసుడు ప్రచారానికి విజయ్ రాకపోవడం గమనార్హం. తమిళ్ లో వారిసు సినిమా విడుదలైనా 3 రోజులు గ్యాప్ ఉండటంతో కచ్చితంగా తెలుగు ప్రచారానికి విజయ్ వస్తాడని దిల్ రాజు తెలిపాడు. కానీ అది కూడా జరగలేదు.

 

ఎప్పటిలాగానే విజయ్ తెలుగు వెర్షన్ ప్రచారాన్ని లైట్ తీసుకోవడం కొందరికి ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. దీంతో దిల్ రాజుపై ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రమోషన్ కోసం అడగడానికి వెళ్తే, మరో కాఫీ కప్పు చేతిలో పెట్టి హ్యాండ్ ఇచ్చినట్టున్నాడంటూ దిల్ రాజు ను నెటిజన్లు ఆడుకుంటున్నారు. మరోవైపు హీరో ప్రచారం చేయని సినిమాకు ప్రేక్షకులు ఎందుకు వెళ్లాలంటూ ఓ చిన్నపాటి బాయ్ కాట్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. అయితే ఈ సంక్రాంతికి థియేటర్లు ఎక్కువగా వారసుడు వైపు ఉండటంతో ఈ మూవీకి భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం కూడా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -