Bangladesh: ఇలా ప్రయాణించారంటే యమ డేంజర్ గురు!

Bangladesh: ప్రస్తుత రోజుల్లో ప్రయాణం అంటేనే చాలామంది భయపడుతున్నారు. ఎందుకు గల కారణం నిత్యం ఈ ప్రమాదాల బారినపడి కొన్ని వందల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. బైక్, కారు, ట్రైన్, చివరికి విమానంలో వెళ్లినా కూడా ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రయాణం చేస్తున్నప్పుడు ఎటు నుంచి మృత్యువు ముంచుకొస్తుందో చెప్పడం అంచనా వేయడం చాలా కష్టం. ఇకపోతే మనం రైలులో ప్రయాణించినప్పుడు కొన్ని రైళ్లలో కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రయాణిస్తూ ఉండగా మరికొన్ని రైళ్లలో పరిమితికి మించి ఎక్కువ మంది జనాలు ప్రయాణిస్తూ ఉంటారు.

 

మరీ ముఖ్యంగా ప్యాసింజర్ రైళ్లలో అయితే జనాలు పరిమితికి మించి పోట్లాడి మరి అందులో ఎక్కి ప్రయాణిస్తూ ఉంటారు. అయితే మామూలుగా ట్రైను పైకి ఎక్కడం లేదంటే భోగిలపై కలిసి ప్రయాణం చేయడం ఇలాంటివి చాలా ప్రమాదకరం అన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా రైలు డోర్ల దగ్గర కూర్చుని నిల్చుని ప్రయాణించడం కూడా చాలా ప్రమాదకరం. కానీ బంగ్లాదేశ్ లో మాత్రం అక్కడ అక్కడి ప్రజల రైలు ప్రయాణం చూస్తే నోరెళ్ళ పెట్టాల్సిందే. వారి ప్రయాణించే రైలు పరిస్థితి చూస్తే వారికి ఏమి కాదా అన్న ప్రశ్న ప్రతి ఒక్కరికి వస్తుంది.

అంతేకాకుండా వారు ప్రాణాలకు తెగించి మరీ ఆ రైలు ప్రయాణం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్ లో కొన్ని ప్రదేశాలకు వెళ్లే ట్రైన్ లలో పరిమితికి మించి ప్రజలు ప్రయాణిస్తూ ఉంటారు. ఎంతలా అంటే రైలు భోగి లోపల మాత్రమే కాకుండా భోగిల పైన కూడా కొన్ని వందల మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. ఏంటి భోగి పైన నా అని ఆశ్చర్యపోతున్నారా. అవును మీరు నిజమే అందుకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ప్లాట్ఫామ్ పై ఆగిన రైలు భోగి పై ఒక మహిళ ఎక్కడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజెన్స్ ఆ విధంగా ప్రయాణించడం చాలా ప్రమాదకరం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Vidyadhar Jena (@fresh_outta_stockz)

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -