KGF Actor: క్యాన్సర్ చికిత్స కోసం సాయం చేయాలని విజ్ఞప్తి… అండగా నిలిచిన సెలబ్రిటీస్?

KGF Actor: కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హీరో యష్ నటించిన చిత్రం కేజిఎఫ్.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎలాంటి విజయం అందుకుందో మనకు తెలిసిందే. ఒక్కసారిగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడంతో సినీ ప్రపంచం మొత్తం కన్నడ చిత్ర పరిశ్రమ వైపు తొంగి చూసింది.ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా కేజిఎఫ్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి భారీ కలెక్షన్లను రాబట్టింది.

ఈ సినిమాలో హీరో యష్ నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. ఇకపోతే యశ్ పక్కన ఆయన సహచరుడుగా నటించిన నటుడు హరీష్ రాయ్ కి మంచి ప్రాధాన్యత లభించిందని చెప్పాలి. ఈ సినిమాతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హరీష్ తాజాగా క్యాన్సర్ బారిన పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈయన చికిత్స నిమిత్తం బెంగళూరులోని కిడ్వాయి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

ఇకపోతే ఈయన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడగా ఇప్పటికే వైద్యులు ఈయనకు సర్జరీ నిర్వహించినట్టు తెలుస్తుంది.ఇలా సర్జరీ అయినప్పటికీ తనకు ఇంకా ఊపిరితిత్తుల సమస్య బాధపడుతోందని అయితే చికిత్స చేయించుకోవడానికి తన వద్ద సరైన డబ్బులు లేవని ఆర్థికంగా తనకు సహాయం చేయాలంటూ అందరిని వేడుకున్నారు. ఈ విధంగా నటుడు హరీష్ విజ్ఞప్తితో కొంతమంది కన్నడ సినీ సెలబ్రిటీలు, నిర్మాతలు ముందుకు వచ్చి ఈయనకు ఆర్థిక సహాయం చేశారు.

ఈ విధంగా ఈయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న కొందరు నటులు తనకు సహాయం చేయడానికి ముందుకు రావడంతో ఇదే స్పూర్తిగా మరికొందరు కూడా ఈయనకు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారని తెలుస్తుంది. ఏదిఏమైనా ఈయన క్యాన్సర్ బారిన పడ్డారని తెలియగానే అభిమానులు త్వరగా ఈయన కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.ఇకపోతే కేజిఎఫ్ సినిమాలో ఈయన నటనకు గాను మంచి మార్కులు పడ్డాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -