Fireboltt: మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్ వాచ్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?

Fireboltt: దేశవ్యాప్తంగా రోజురోజుకీ స్మార్ట్ వాచ్ ల డిమాండ్, క్రేజ్ విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే ఆయా కంపెనీలు మార్కెట్లోకి కొత్త కొత్త ఫీచర్లు కలిగిన స్మార్ట్ వాచ్లను విడుదల చేస్తున్నాయి. అలాగే వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లు కలిగిన స్మార్ట్ వాచ్ లను తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ఫైర్ బోల్ట్ ఈ మధ్యకాలంలో వరుసగా స్మార్ట్ వాచ్ లను విడుదల చేస్తూ వినియోగదారుల విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ఫైర్ బోల్ట్ మరో కొత్త వాచ్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది.

ఫైర్ బోల్ట్ ఫోనిక్స్ ప్రో పేరుతో రిలీజ్ చేసిన ఈ వాచ్‌లో చాలా మంచి మంచి ఫీచర్లు ఉన్నాయి. బ్లూ టూత్ కాలింగ్ ఫీచర్‌తో పాటు 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్స్‌లో ఈ వాచ్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. అలాగే హార్ట్ బీట్ సెన్సార్‌తో పాటు వాయిస్ అసిస్టెంట్ మద్దతుతో లభిస్తోంది. కాగా తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన ఈ ఫైర్ బోల్ట్ ఫోనిక్స్ ప్రో స్మార్ట్ వాచ్ ధర రూ.1799గా ఉంది. ఈ స్మార్ట్ వాచ్ మనకు బూడిద నలుపు రంగులో లభించనుంది. ఈ వాచ్ ను ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్స్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ కేవలం రూ.1499కే అందుబాటులో ఉంది.

ఇకపోతే ఈ ఫైర్ బోల్ట్ ఫోనిక్స్ ప్రో ఫీచర్ ల విషయానికి వస్తే.. 1.39 అంగుళా డిస్‌ప్లేతో 240×240 స్క్రీన్ రిజుల్యూషన్‌ తో వస్తుంది. బ్లూ టూత్ కాలింగ్ ఫీచర్ ఏడు రోజుల బ్యాటరీ బ్యాకప్, అందుబాటులో 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్స్‌అప్ గ్రేడెట్ హెల్త్ సూట్‌తో కీలక అంశాలు ట్రాక్ చేసే అవకాశం. హార్ట్ బీట్ సెన్సార్, ఎస్‌పీ ఓ2 మానిటర్ ద్వారా నిద్ర, ఇతర కార్యకలాపాల ట్రాకింగ్ లాంటి మంచి మంచి ఫీచర్లు స్మార్ట్ వాచ్ లో మనకు లభించనున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -