Diabetes: డయాబెటిస్ పేషెంట్లు పచ్చి అరటి పండు తీసుకుంటే ఏం జరుగుతుంది తెలుసా?

Diabetes: ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో డయాబెటి సమస్య కూడా ఒకటి. ప్రతి పదిమందిలో దాదాపు 8 మంది ఈ డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. డయాబెటిస్ కారణంగా చాలామంది ఎటువంటి ఫుడ్ తినాలి అన్నా కూడా సంకోచిస్తుంటారు. ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల డయాబెటిస్ మందులు వచ్చినప్పటికీ కేవలం అవి రక్తంలో షుగర్ లెవల్స్ ని కంట్రోల్ లో ఉంచడం వరకు మాత్రమే పనిచేస్తాయి. ఒక్కసారి డయాబెటిస్ వచ్చింది అంటే ఇంక మళ్ళీ పోదు. ఏదైనా ఆహారం తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయేమో అన్న భయంతో చాలామంది తినకుండా చాలా ఆహార పదార్థాలను అవాయిడ్ చేస్తూ ఉంటారు.


ఇకపోతే చాలామంది డయాబెటిస్ ఉన్నవారు అరటిపండు తినవచ్చా లేదా అని అనుకుంటూ ఉంటారు. కొంతమంది తినవచ్చు అనుకుంటే మరి కొంతమంది తీపి పదార్థం కాబట్టి తినకూడదు అని అనుకుంటూ ఉంటారు. ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

డయాబెటిస్ ఉన్నవారు కొంచం పచ్చిగా ఉండే అరటిపండ్లను తినాలి. ఆకుపచ్చగా ఉండే అరటి పండ్లలో రెసిస్టెంట్ స్టార్చ్ పుష్కలంగా లభిస్తుంది. ఇది డయాబెటిస్ రోగులలో కరిగే ఫైబర్ గా పని చేస్తుంది. ఈ రెసిస్టెంట్ స్టార్చ్ ని గ్లూకోజ్ గా మార్చడాన్ని పండించడం అంటారు. అందుకే పచ్చి అరటిపండ్లలో గ్లూకోజ్ శాతం చాలా తక్కువుగా ఉంటుంది. ఇది శరీరంలోని రక్తంలో చక్కర పెరిగే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది.

పచ్చి అరటిపండు లో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. పచ్చి అరటిపండులో ఉండే ఫైబర్ ఆకలిని కూడా అణిచి వేసి రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. ఇంకా పచ్చి అరటిపండు తీసుకుంటే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి అరటిపండు తీసుకోవడం వల్ల బరువు కూడా అదుపులో ఉంటుంది. అలాగే క్యాన్సర్ రిస్క్ తగ్గడమే కాకుండా గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అంతేకాదు ఉదయాన్నే పచ్చి అరటిపండు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు కూడా దృడంగా మారతాయి.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -