Xiaomi: షావోమి నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ మాములుగా లేవుగా?

Xiaomi: ప్రముఖ చైనా స్మార్ట్‌ ఫోన్ ​దిగ్గజం షావోమి ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు అద్భుతమైన ఫీచర్ లు కలిగిన సరికొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తూనే ఉంది. ఇది ఇలా ఉంటే షావోమి సంస్థ తాజాగా మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ తీసుకువచ్చింది. షావోమి 13 ప్రో 5జీ పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్ లోకి తీసుకువచ్చింది. చైనా మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ మొబైల్ ఫోన్ని భారత మార్కెట్ లోకి తీసుకువచ్చింది షావోమి. మరి ఈ స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్ల విషయానికొస్తే..

ఈ స్మార్ట్ ఫోన్ ధర చైనా మార్కెట్లో ఈ మొబైల్ ధర 4,999 యువాన్లు అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా రూ. 61,000 గా ఉంటుందని అంచనా. స్పెసిఫికేషన్ ల విషయానికి వస్తే.. క్వాల్‍కామ్ స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 శక్తివంతమైన ప్రాసెసర్‌తో లభించే ఈ మొబైల్ ఫ్లాగ్‍షిప్ కెమెరాలతో కూడా లభిస్తుంది. షావోమీ కొత్త మొబైల్ వైర్‌లెస్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో 4,820mAh బ్యాటరీ ఉంటుంది. 120 వాట్స్ వైర్డ్ హైపర్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్‍కు, 50 వాట్స్ వైర్‌లెస్ టర్బో ఫాస్ట్ చార్జింగ్, 10 వాట్ల వైర్‌లెస్ రివర్స్ చార్జింగ్‍ వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది.

 

అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా లభించనుంది. షావోమీ 13 ప్రో మొబైల్ లో పవర్‌ఫుల్ స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 5జీ ప్రాసెసర్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్, LPDDR5X ర్యామ్, ఆండ్రాయిడ్ 13 బేస్డ్ MIUI 14 ఆపరేటింగ్ సిస్టమ్‍, డాల్బీ ఆడియో, హైరెస్ ఆడియో సపోర్ట్ ఉండే డ్యుయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అంతే కాకుండా ఇందులో 6.73 ఇంచెస్ 2K రెజల్యూషన్ LTPO 3.0 అమోలెడ్ డిస్‍ప్లే ఉంటుంది. ఇది ఏకంగా 1,900 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్ పొందుతుంది. డిస్‍ప్లేకు గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉంటుంది. కాగా ఈ స్మార్ట్ ఫోన్ మనకు సెరామిక్ బ్లాక్, సెరామిక్ వైట్ కలర్ ఆప్షన్‍లలో లభించనుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -