Health Tips: ఉప్పు వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Health Tips: ఉప్పు ఎక్కువగా తింటే బీపీ వస్తుంది అని వైద్యులు ఇంట్లోని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ చాలా రకాలు వంటకాలు ఉప్పు లేకుండా అసలు తినలేము. ఉప్పు ఎక్కువ అయినా కూడా అటువంటి వంటకాలు అని తినలేము. చాలామంది ఉప్పు వల్ల అనారోగ్య ప్రయోజనాలు తప్ప ఆరోగ్య ప్రయోజనాలు లేవని అనుకుంటూ ఉంటారు. కానీ అలా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఉప్పు వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఉప్పు వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొంచం ఉప్పును ఇంట్లోని త‌లుపులు, కిటికీలు, షెల్ప్‌ల వంటి ప్ర‌దేశాల్లో చ‌ల్లడం వల్ల చీమ‌లు రావు.

ఇలా చేయ‌డం వ‌ల్ల ఇంట్లో ఉండే తేమ వాతావర‌ణం కూడా పొడిగా మారుతుంది. కొంత యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ లో కొద్దిగా ఉప్పు వేసి ఓ మిశ్ర‌మంగా చేసి రాగి, వెండి, ఇత్త‌డి పాత్ర‌ల‌ను తోమితే అవి త‌ళ‌త‌ళా మెరుస్తాయి. రెండు, మూడు టేబుల్ స్పూన్ల ఉప్పును 3.5 లీట‌ర్ల గోరు వెచ్చని నీటిలో వేసి బాగా క‌ల‌పాలి. ఈ మిశ్రామాన్ని ఉప‌యోగించి కిటికీలు, తలుపులు, గ్లాస్ విండోస్‌, కార్ విండోస్‌ లాంటివి క్లీన్ చేస్తే స్ప్రే అవసరం లేకుండానే శుభ్రంగా మెరుస్తాయి. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొంత ఉప్పు వేసి బాగా క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని 1 నిమిషం పుక్కిలించాలి. దీంతో దంతాల నొప్పి, నోటి పూత వంటివి పోతాయి.

 

అలాగే కార్పెట్లు, దుప్ప‌ట్లు, దుస్తులపై ప‌డ్డ మ‌ర‌కల‌ను తొలగించడానికి కొంత నీటిలో ఉప్పును వేసి బాగా క‌లిపి, ఆ నీటిలో ముంచిన క్లాత్ తో తుడిస్తే మర‌క‌లు ఇట్టే తొల‌గిపోతాయి. వేడి వేడి నీటిలో గుప్పెడు ఉప్పు వేసి కిచెన్ సింక్‌ ను క్లీన్ చేస్తే అందులో జామ్ అయిన చెత్త పోతుంది. కొద్దిగా ఉప్పును, ల‌వంగ నూనె లేదా ఆలివ్ ఆయిల్‌ తో బాగా క‌లిపి శ‌రీరానికి రాయాలి. అనంత‌రం కొంత సేపు అయ్యాక స్నానం చేస్తే చ‌ర్మంపై ఉండే మురికి మొత్తం పోయి శ‌రీరం కాంతివంతంగా మారుతుంది. బేకింగ్ సోడా ఉప్పును స‌మాన భాగాల్లో తీసుకుని కొంత నీటికి కలిపి పేస్ట్‌లా చేసి దాంతో ప‌ళ్లు తోముకుంటే ప‌ళ్లు మిల‌మిలా మెరుస్తాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -