Rajasthan: మామపై ప్రేమతో ఇంటినుంచి పారిపోయిన కోడలు.. ట్విస్ట్ ఏంటంటే?

Rajasthan: ప్రేమకు వయసుతో సంబంధం లేదు అని అంటూ ఉంటారు. అది నిజమే. ఎందుకంటే ప్రేమ ఎవరి మధ్య ఎప్పుడూ ఎలా పుడుతుందో చెప్పడం చాలా కష్టం. ఈ మధ్యకాలంలో అలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కూడా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. రాజస్థాన్‌లోని బుందీ జిల్లాలో ఈ ఘటనే చోటు చేసుకుంది. కొడుకు భార్య మీద మనసు పడిన ఓ మామ కోడలిని తీసుకొని పారిపోయాడు. ఆమె కూడా ఆరు నెలల బిడ్డను ఇంట్లోనే వదిలేసి తన భర్తను కాదు అని మామతో పాటు వెళ్లిపోయింది. ఆ మహిళ భర్త చేసేదేంలేక వెంటనే పోలీసులను ఆశ్రయించాడు.

తన తండ్రి తన భార్యను తీసుకొని వెళ్లిపోయాడని, పారిపోయేందుకు వారిద్దరూ తన బైక్‌నే ఉపయోగించారని బాధితుడు వాపోయాడు. అయితే తన భార్య అమాయకురాలని, తన తండ్రి ఆమెకు మాయమాటలు చెప్పి ప్రలోభపెట్టాడని బాధితుడు పవన్ వైరాగి పోలీసులకు తెలిపాడు. తన భార్య ఎక్కడుందో వెతికి తీసుకురావాలని పోలీసులని అతను కోరాడు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కాగా పోలీసులు తన కేసును సీరియస్‌గా తీసుకోలేదని పవన్ ఆరోపించగా పవన్ ఆరోపణల పై సదర్ స్టేషన్ ఆఫీసర్ అరవింద్ భరద్వాజ్ స్పందించారు.

 

ఆ కేసును తాము సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. కానీ నిందితులు ఎటువంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడ్డారని, చోరీకి గురైన బైక్‌తో పాటు పారిపోయిన జంట ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే ఈ మధ్యకాలంలో అటువంటి ఘటనలు చాలా చోటు పోటీ చేసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -