Devotional: నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే చాలు.. ధన ప్రవాహమే?

Devotional: సాధారణంగా చాలామంది ఎన్నో రకాల వ్యాపారాలు పెడుతూ ఉంటారు. వ్యాపారం పెట్టడం సులువే కానీ వ్యాపారంలో రాణించడం అంటే ఆశామాషీ వ్యవహారం కాదని చెప్పవచ్చు. అయితే కొంతమంది వ్యాపారంలో రోజు రోజుకి అభివృద్ధి చెందితే మరికొందరికి మాత్రం వ్యాపారం అంతగా కలిసి రాక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే వ్యాపారంలో బాగా రాణించాలి అదృష్టం కలిసి రావాలి అనుకుంటే నిమ్మకాయతో ఈ రకమైన పరిహారాలు పాటించాలి. అందుకోసం ఆదివారం మధ్యాహ్నం ఐదు నిమ్మకాయలను కోసి మీ వ్యాపార కార్యాలయంలో ఉంచండి.

ఒక పిడికెడు ఎండుమిర్చి ,ఒక పిడికెడు పసుపు ఆవాలు వేయండి. మరుసటి రోజు ఉదయం ఈ వస్తువులను ఎవరూ తిరగలేని ప్రదేశంలో పారవేస్తే వ్యాపారంలో రాణిస్తారు. అంతేకాకుండా అప్పటినుంచి వ్యాపారంలో అభివృద్ధిని మీరు చూడవచ్చు. అలాగే ఏదైనా పనిమీద బయటకు వెళ్లినప్పుడు అనుకున్న పనులు జరగాలంటే నిమ్మకాయను తీసుకుని దానిని రెండు భాగాలుగా కట్ చేసుకోండి. ఒక భాగాన్ని వెనుకకు, మరొకవైపు విసిరి పనికి వెళ్లండి. ఇలా చేస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. అనుకున్న పనులు కూడా నెరవేరుతాయి. అలాగే ఇంట్లో సభ్యునికి చెడు దృష్టి ఉంటే అతడి తల నుండి కాలి వరకు ఏడు సార్లు నిమ్మకాయను దిష్టి తీయాలి.

 

అనంతరం ఈ నిమ్మకాయను నాలుగు ముక్కలుగా కట్ చేసి ఎవరూ తిరగలేని ప్రదేశంలో విసిరేయండి. నిమ్మకాయ ముక్కలను విసిరిన తర్వాత వెనక్కి తిరిగి చూడకండి. ఇలా చేస్తే ఇతరుల చెడు దృష్టి, దిష్టి తగ్గిపోతాయి. అలాగే ఆదివారం రోజు నిమ్మకాయ పై నాలుగు లవంగాలను ఉంచి ఓం శ్రీ హనుమంతే నమః అని 108 సార్లు జపించడం ద్వారా మీరు మీ పనిలో విజయం సాధిస్తారు. ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. పెరట్లో నిమ్మ చెట్టును నాటడం చాలా ప్రయోజనకరమైనది. ఇంట్లో నిమ్మకాయ చెట్టు ఉంటే ఆనందానికి, శ్రేయస్సుకు ఉపయోగకరంగా ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -